చైనాలో పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు కొత్త పథకం! డేటింగ్ చేసిన వారికి నగదు రివార్డ్!

Header Banner

చైనాలో పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు కొత్త పథకం! డేటింగ్ చేసిన వారికి నగదు రివార్డ్!

  Wed Nov 20, 2024 11:22        Others

 చైనా కొంతకాలంగా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీని నుంచి బయటపడేందుకు అక్కడి పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన కాంటెస్ట్లు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తుంది. ఈమేరకు అక్కడి వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ చైనాలో షెన్జెన్ లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఇందుకుగాను ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫార్మ్ కంపెనీలోని సింగిల్స్ బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా ఆప్లో పోస్ట్లు పెట్టాలి. అందుకుగాను వారికి 66 యువాన్లు (భారత కరెన్సీలో రూ.770) ఇస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికీ వెయ్యి యువాన్లు (రూ.11,650) రివార్డును అందిస్తారు. అయితే, పలువురు ఈ ప్రకటనను ఆహ్వానించగా.. మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.



ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?



గతంలో అధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండేది. జనాభా నియంత్రణకు అప్పట్లో అధికారులు చర్యలు తీసుకోవడంతో క్రమంగా జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 4.74 మిలియన్ల మంది జంటలు మాత్రమే ఒక్కటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇది గత ఏడాది నమోదైన వివాహాలతో పోలిస్తే 16.6 శాతం తక్కువ. ఇక, దేశంలో జననాల రేటు సైతం పడిపోయింది. 2023లో దేశవ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటుచేసుకోగా.. 1949 నుంచి ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే జనాభా రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుంది. అందులోభాగంగా పలు పాలసీలను సైతం ప్రవేశపెడుతుండటం గమనార్హం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


రాజధాని అమరావతి
పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #china #dating #marraige #couple #techcompanies #todaynews #flashnews #latestupdate