పదో తరగతి విద్యార్థులకు మాధ్యమం ఎంపిక స్వేచ్ఛ! ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం!

Header Banner

పదో తరగతి విద్యార్థులకు మాధ్యమం ఎంపిక స్వేచ్ఛ! ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం!

  Thu Nov 21, 2024 09:06        Others

పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం (AP Govt) అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు కావాలంటే ఐచ్ఛికాన్ని మార్చుకోవచ్చని సూచించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల వారిని ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతూ గత వైకాపా ప్రభుత్వం 2020-21లో ఆదేశాలిచ్చింది. (AP SSC Exams) అయితే ఆంగ్ల మాధ్యమం అమలుపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైనందున 'ఇంగ్లిష్ మీడియం' అని వాడకుండా ‘ఒకే మాధ్యమం' ఉండాలని ఆదేశించారు. అనధికారికంగా ఆంగ్ల మాధ్యమమే అన్నట్లు వ్యవహరించారు. ఒక్కో తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్లు ప్రకటిస్తూ, పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన పెట్టారు. ఒకే మాధ్యమం అమలు చేయాలని చెప్పడం మినహా ఏ మాధ్యమం అనేది చెప్పకపోవడంతో చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించారు. ఇలా తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులు కోరడంతో ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదీకి అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది.



ఇంకా చదవండిఆరవ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టు విడుదల! ఏ ప్రముఖులకు చోటు దక్కిందంటే?



రికార్డుల్లోనే ఆంగ్ల మాధ్యమం
రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి చదువుతున్న వారు 6.20 లక్షల మంది ఉండగా.. ఇప్పటి వరకు ఆన్లైన్ నామినల్ రోల్స్లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు నమోదు చేశారు. ఇందులో 39 వేలకు పైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం అమలవుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేసింది. క్షేత్రస్థాయిలో తరగతులు, బోధనను పట్టించుకోకుండా ఒకే మాధ్యమం అంటూ పేర్కొంది. విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలు ఇస్తున్నందున చాలాచోట్ల తెలుగులోనే పాఠాలు చెప్పగా.. విద్యార్థులు మాతృభాషలోనే చదువుకున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో విద్యార్థులు ఎలా రాసినా మార్కులు ఇచ్చేశారు. ఒకేసారి తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేయడంతో వీరు అభ్యసనకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బ్యాచ్ విద్యార్థులు పదో తరగతికి రావడంతో ఆంగ్లంలో చదివి, ఆంగ్లంలో పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈరోజు(21-11-2024) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసింది! గత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్! ఏపీలో మూడు రోజులపాటు ఉచిత బస్సు సేవలు - ఎందుకు అంటే!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రాజధాని అమరావతిపోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి! ఎత్తుకు పై ఎత్తు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

ఎమ్మెల్యే కట్టుకున్న చీరపై రఘురామకృష్ణరాజు ఆసక్తికర ప్రశ్న! ఏం అడిగారంటే!

 

నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్! ఆ వివరాలు మీ కోసం!

 

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్విజయవాడవైజాగ్.. భారీగా విమానాల సర్వీసులు పెంపు!

 

గుడ్ న్యూస్: భారీగా పడిపోయిన బంగారం ధర! ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరు!Don't Miss

 

వైసీపీకి మరో బిగ్ షాక్: విద్యార్థిని ఫిర్యాదు.. మాజీ మంత్రిపై కేసు నమోదు! ఎందుకో తెలుసా?

 

వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #tenthclass #language #selection #apsscexam #todaynews #flashnews #latestupdate