అక్రమ లైసెన్సులతో రష్యాకు విమాన భాగాల తరలింపు! అమెరికాలో భారతీయుడి అరెస్ట్!

Header Banner

అక్రమ లైసెన్సులతో రష్యాకు విమాన భాగాల తరలింపు! అమెరికాలో భారతీయుడి అరెస్ట్!

  Sat Nov 23, 2024 13:53        Others

అమెరికా (USA)కు చెందిన విమాన విడి భాగాలను రష్యా(Russia)కు అక్రమంగా తరలించేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు అగ్రరాజ్యం పేర్కొంది. ఈ కుట్రలో భాగమైన ఓ భారతీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. సంజయ్ కౌశిక్ (57) అనే భారతీయుడిని గతనెల 17న అరెస్టు చేయగా.. ఇటీవల ఆ నిందితుడిపై అభియోగాలు దాఖలు చేసినట్లు న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో.. అమెరికాలోని విమాన విడి భాగాలు, సాంకేతికతను చట్టవిరుద్ధంగా రష్యాలోని పలు సంస్థలకు తరలించాలని సంజనౌకౌశిక్తో పాటు పలువురు కుట్ర పన్నారు. ఈ ఎగుమతులకు సంబంధించి తప్పుడు ప్రకటనలు సైతం చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కౌశిక్ అతని అనుచరులు ఒరెగాన్కు చెందిన సరఫరాదారు నుంచి విమానం కోసం నావిగేషన్, ఫ్లైట్ కంట్రోల్ డేటాను అందించే ఆటిట్యూడ్ హెడ్డింగ్ రిఫరెన్స్ సిస్టమ్ (AHRS)ని కొనుగోలు చేశారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఏహెచ్ఎర్ఎస్ వంటి భాగాలు ఎగుమతి చేయాలంటే వాణిజ్య విభాగం నుంచి లైసెన్స్ అవసరం. అందుకుగాను భారత్లోని తన మరో కంపెనీ కోసం వీటిని కొనుగోలు చేస్తున్నానని, వాటిని పౌర హెలీకాఫ్టర్లో వినియోగించనున్నట్లు తప్పుగా పేర్కొని అక్రమంగా లైసెన్స్లు పొందారు. కాగా, ఆ విడి భాగాలను ఎగుమతి చేసే ముందే అమెరికా అధికారులు వాటిని పట్టుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా అధికారులు మోపిన అభియోగాలు రుజువైతే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ప్రతి కౌంట్కి 1 మిలియన్ డాలర్ల వరకు జరిమానా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #america #rashya #aeroplane #illegal #transport #todaynews #flashnews #latestupdate