స్కార్పీన్ జలాంతర్గామి-మత్స్యకార పడవ ఢీకొన్న ఘటన! సముద్రంలో విషాదం,ఇద్దరు అదృశ్యం!

Header Banner

స్కార్పీన్ జలాంతర్గామి-మత్స్యకార పడవ ఢీకొన్న ఘటన! సముద్రంలో విషాదం,ఇద్దరు అదృశ్యం!

  Sat Nov 23, 2024 18:31        Others

భారత నౌకాదళానికి చెందిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఒకటి ఢీకొంది. ఈ ప్రమాదంలో పడవ బోల్తాపడి అందులోని 13 మంది సముద్రంలో పడిపోయారు. వీరిలో 11 మందిని సమీపంలోని యుద్ధనౌకల్లో ఉన్న నేవీ సిబ్బంది రక్షించారు. మిగతా ఇద్దరి ఆచూకీ దొరకలేదు. వీరికోసం భారీగా గాలింపు జరుగుతోంది. నేవీకి చెందిన ఆరు నౌకలు, ఒక విమానం ఇందులో పాల్గొంటున్నాయి. తీరరక్షణ దళం కూడా రంగంలోకి దిగింది. గోవా తీరానికి 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మారథోమా అనే ఈ మత్స్యకార పడవ ఢీ కొట్టడం వల్ల జలాంతర్గామికి ఏ మేరకు నష్టం జరిగిందనే విషయం వెల్లడి కాలేదు. ఘటనపై నౌకాదళం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


నేవీలో కీలకం
అత్యంత అధునాతనమైన స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు భారత నౌకాదళంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాముల వేట, నిఘా సమాచార సేకరణ, సాగరజలాల్లో మందుపాతరలు అమర్చడం, నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యర్థుల కదలికలపై కన్నేసి ఉంచడం వంటి కార్యకలాపాలు సాగించగలవు. ఫ్రాన్స్ తోడ్పాటుతో నిర్మించిన ఈ జలాంతర్గాములకు శత్రువుల నిఘా సాధనాలకు దొరకని రీతిలో అద్భుతమైన స్టెల్త్ లక్షణాలు ఉన్నాయి. టోర్పిడోలు, నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించగలవు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #bharath #submarine #sea #ship #todaynews #flashnews #latestupdate