ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

Header Banner

ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!

  Tue Dec 17, 2024 14:59        Others

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణలోని శాశ్వత నివాసితులైన వారికి.. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 85 శాతం స్థానిక కోటా కింద.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని 53 మంది పిటిషనర్లు కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసినా.. ఇప్పటికీ తెలంగాణలో శాశ్వత నివాసులుగా ఉన్నామని కోర్టుకు వివరించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



స్థానిక అభ్యర్థులకు సంబంధించి రూల్ 3 (ఎ) వారి హక్కులను ఉల్లంఘించిందని వాదించారు. పిటిషనర్ల వాదనలను పరిశీలించిన హైకోర్టు.. కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రం వెలుపల విద్యా భ్యాసం పూర్తి చేసినప్పటికీ, తెలంగాణలో శాశ్వత నివాసితులైన విద్యార్థులను చేర్చేలా రూల్ 3(ఎ)ని సవరించాలని ఆదేశించింది. పిటిషనర్లు తెలంగాణలో తమ నివాసం, శాశ్వత నివాసాన్ని రుజువు చేసుకుంటే స్థానిక కోటా కింద ప్రవేశానికి అర్హులని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా నాలుగు లైన్ల రహదారి ప్రాజెక్టులకు మోక్షం! ఆ రూట్లలోనే..ఆ జిల్లా వారికి పండగ!

  

2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..

 

ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?

  

ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!

 

కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..

 

రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!

     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #telangana #highcourt #students #todaynews #flashnews #latestupdate