విజయవాడలో తీవ్ర విషాదం! ప్రాణం తీసిన కలుషిత నీరు! వందమందికి అస్వస్థత! ఆ పార్టీ వాళ్లే కారణం అని తేల్చి చెప్పిన స్థానికులు!

Header Banner

విజయవాడలో తీవ్ర విషాదం! ప్రాణం తీసిన కలుషిత నీరు! వందమందికి అస్వస్థత! ఆ పార్టీ వాళ్లే కారణం అని తేల్చి చెప్పిన స్థానికులు!

  Wed May 29, 2024 06:15        India

విజయవాడలోని మొగల్రాజపురంలో నగరపాలకసంస్థ సరఫరా చేసిన నీరు తాగి ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. మొగల్రాజపురంలో వల్లూరు దుర్గారావు అనే వ్యక్తి కలుషితమైన నీళ్లు తాగి.. అస్వస్థతకు గురై సోమవారం చనిపోయారు. మరో వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో అధికారులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. 30 పడకలతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ సరఫరా చేసిన నీటిని తాగవద్దని సూచిస్తున్నారు. అలాగే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చనిపోయిన వ్యక్తికి నాలుగుసార్లు విరేచనాలు అయ్యాయని.. ఆయన ఫిట్స్ రావటంతో చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు.

 

ఇంకా చదవండి: ఓరి దేవుడా! టెంపుల్ ని కూడా వదిలిపెట్టట్లేదు గా! ఇంత చండాలపు ఆలోచన ఎలా!! అసలు ఏం జరిగింది అంటే?

 

మొగల్రాజపురంలో నీటిని పరీక్షకు పంపిన అధికారులు.. రిపోర్టు వచ్చిన తర్వాతే అసలు నిజం తెలుస్తుందని చెప్పారు. అయితే మొగల్రాజపురం వాసులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. కలుషితమైన నీళ్లు వస్తున్నాయని చెప్పినా కూడా.. అధికారులు పట్టించుకోలేదంటున్నారు. ఆ నీళ్లు తాగే విరేచనాలతో దుర్గారావు చనిపోయాడని చెప్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Vijayawada #WaterProblem #KalusitaNeru #OnePersonDead