పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసి ఆగిన తల్లి గుండె! ఎన్నో ఆశలతో.. చివరికి ఇలా! హృదయాలను కదిలించే ఘటన!

Header Banner

పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసి ఆగిన తల్లి గుండె! ఎన్నో ఆశలతో.. చివరికి ఇలా! హృదయాలను కదిలించే ఘటన!

  Wed May 29, 2024 07:22        India

నవమోసాలు మోసి జన్మనిచ్చిన పేగుబంధం.. కళ్లముందే కన్నుమూసింది. తన పేగు తెంచుకుని పుట్టిన పసిపాప ప్రపంచాన్ని చూడకముందే కనుమూసింది. దీంతో ఆ అమ్మ గుండె పగిలింది. తనకు పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణం వదిలేసిందని తెలిసుకున్న ఆ తల్లి గుండె బద్ధలైంది. తన బిడ్డతో పాటే తాను కూడా తనువు చాలించింది. ఈ విషాదకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన రమ్యప్రియ సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా చేస్తోంది. రమ్యప్రియకు నెలలు నిండి పురిటినొప్పులు రావటంతో కుటుంబసభ్యులు పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. నొప్పులు ఎక్కువ కావటం, సాధారణ కాన్పు కష్టం కావటంతో వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.

 

ఇంకా చదవండి: విజయవాడలో తీవ్ర విషాదం! ప్రాణం తీసిన కలుషిత నీరు! వందమందికి అస్వస్థత! ఆ పార్టీ వాళ్లే కారణం అని తేల్చి చెప్పిన స్థానికులు!

 

కానీ కడుపులోనే శిశువు చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని రమ్య కుటుంబసభ్యులకు తెలిపారు. సిజేరియన్ తర్వాత వేరొక గదిలో ఉన్న రమ్యప్రియ.. కాసేపటికి మెలుకువలోకి వచ్చింది. అయితే బిడ్డ చనిపోయిన విషయం కుటుంబసభ్యుల ద్నారా తెలుసుకున్న రమ్యప్రియ.. ఆ చేదు నిజాన్ని తట్టుకోలేకపోయింది. గట్టిగా కేకలువేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపటికే తాను కూడా తనువు చాలించింది. రమ్యప్రియ మరణవార్త ఆ కుటుంబంలోనూ, ఆ గ్రామంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లీబిడ్డను కోల్పోయిన రమ్యప్రియ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #BornBaby #Dead #WomenDead #Viral #SitaramarajDistrict