హైదరాబాద్ మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త‌గా 27 ర‌కాల బీర్లు! ఆ రెండు బీర్లు టేస్ట్ సూపర్!

Header Banner

హైదరాబాద్ మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త‌గా 27 ర‌కాల బీర్లు! ఆ రెండు బీర్లు టేస్ట్ సూపర్!

  Thu May 30, 2024 11:01        India

తెలంగాణలో కొత్త‌గా 27 ర‌కాల బీర్లు రాబోతున్నాయి. దీనికోసం ఇప్ప‌టికే కొత్తగా ఐదు బీర్ల త‌యారీ కంపెనీలకు ఈ ఏడాది రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే, వీటిలో అధికంగా క్రాఫ్ట్‌ బీర్లే ఉన్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ బేవరేజ్‌ కార్పొరేషన్‌ కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్‌ బ్రేవరీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎక్సోటికా లిక్కర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, మౌంట్‌ ఎవరెస్ట్ లిమిటెడ్‌, లీలాసన్స్‌ ఆల్కా బేవ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, సోం డిస్టిలరీస్‌ అండ్‌ బేవరేజెస్‌ ఉన్నాయి. ఇక ఎక్సైజ్‌శాఖ కొత్త‌గా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో ఒకటైన ‘లీలాసన్స్‌ ఆల్కా బెవ్‌’ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తుంది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు విక్ర‌యిస్తోంది. అలాగే చెన్నైలో ‘సెయింట్‌ పాట్రిక్స్‌’ పేరుతో మద్యం బీర్లు రూపొందిస్తోంది.

 

ఇంకా చదవండి: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్! ఇకపై నో టెన్షన్! గతంలో మద్యం షాపుల్లో కేవలం!

 

కాగా, ఈ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన‌ది. ‘అమెరికన్‌ బ్రూవ్‌ క్రాఫ్ట్‌ లిమిటెడ్‌ (ప్రై)’తో ఈ కంపెనీ టైఅప్‌ అయినట్లుగా తెలుస్తోంది. ‘బ్లాక్‌ బస్టర్‌’ పేరుతో నాలుగు ఫ్లేవర్లలో బీర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. కాగా తెలంగాణలో మాత్రం రెండు బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. అలాగే ఎక్సోటికా లిక్కర్‌ ప్రై. లి. కంపెనీ కూడా సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకుంది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Telangana #Beer #RevanthReddy #ExciseDepartment