గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!

Header Banner

గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!

  Fri Jun 28, 2024 08:40        India

పసుపు పచ్చ, రెడ్ సిగ్నల్స్ పడ్డా ఆగని వాహనదారులున్న ఈ జమానాలో ఓ ఆవు ట్రాఫిక్ నిబంధనలను గౌరవిస్తూ ట్రాఫిక్ కూడలి వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆవు ఆగిపోయింది. తెల్లగీతను దాటకుండా నిలబడింది. వెనక హారన్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు. ఇతర వాహనదారుల వలెనే అది గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది. సిగ్నల్ మారగానే ముందుకు కదిలింది. 

 

ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ వీడియోను షేర్ చేసిన పూణె పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు కూడా చేశారు. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆవు లాగా ఆగిపోండి అంటూ సరదా కామెంట్ చేశారు. మరోవైపు, వీడియోకు జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాము ఇలాంటి ఘటన ఎక్కడా చూడలేదని అనేక మంది వ్యాఖ్యానించారు. వాహనదారులకంటే ఆవుకే నిబద్ధత ఎక్కువని కొందరు కీర్తించారు. కొందరు మాత్రం పూణె పోలీసులపై కీలక ప్రశ్నలు సంధించారు. ఆవులు, ఇతర జంతువులు రహదారుల్లో ఇలా తిరగడం వాహనదారులకు ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు. ఆవు యజమానిది బాధ్యతారాహిత్యమని కొందరు విమర్శించారు. జంతువులను ఇలా రహదారులపై వదలడం వాటికి కూడా ప్రమాదమేనని పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి 

మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు! 

 

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం! 

 

వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు! 

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు! 

 

మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India #Pune #Maharashtra #Viral #Trending #Animals