హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్! ఫుడ్ సర్వేలో అట్టడుగు స్థానం!

Header Banner

హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్! ఫుడ్ సర్వేలో అట్టడుగు స్థానం!

  Sat Nov 16, 2024 20:52        India

ఆహారం విషయంలో హైదరాబాద్ కు ఎంతటి ఘనచరిత్ర ఉందో అందరికీ తెలుసు. హైదరాబాద్ బిర్యానీ, హలీం, మొఘలాయి వంటకాలు... ఇలా హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరింది. అయితే, గత కొంతకాలంగా భాగ్యనగరం పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి. కొన్ని హోటళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం, అధికారుల తనిఖీల్లో కుళ్లిన చికెన్, పాడైపోయిన ఆహార పదార్థాలు బయటపడడం వంటి ఘటనలే అందుకు కారణం. 

 

ఇంకా చదవండిఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం! ఆన్‌లైన్‌లోనే ప్రైమ‌రీ స్కూల్ క్లాసులు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొన్ని చోట్ల బిర్యానీల్లో బొద్దింకలు, ఇతర జీవులు కూడా దర్శనమిచ్చాయి. గత రెండు నెలల కాలంలో నగరంలో 84 శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయంటే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. దాంతో కొన్ని రెస్టారెంట్లలో భోజనం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

 

ఇంకా చదవండిఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

 

వీటన్నింటికీ పరాకాష్ఠగా... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయస్థాయిలో చేపట్టిన ఓ సర్వేలో హైదరాబాద్ చివరిస్థానంలో నిలిచింది. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్ లోని 19 మేజర్ సిటీల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని చేపట్టిన ఈ సర్వేలో హైదరాబాద్ కు అట్టడుగు స్థానం దక్కింది. దారుణమైన విషయం ఏమిటంటే... హైదరాబాదులోని 62 శాతం హోటళ్లలో గడువు తీరిన ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నారట.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

 

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

 

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

 

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

 

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

 

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకుఎప్పుడు అంటే?

 

నటి శ్రీరెడ్డి రాసిన లేఖకు వెన్నపూసలా కరిగిపోయిన లోకేష్! ఆమెకు బంపర్ ఆఫర్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group   

 

 


   #AndhraPravasi #India #Hyderabad #Telangana