కాలుష్యాన్ని తగ్గించాలంటే అదొక్కటే పరిష్కారం! కేంద్రానికి ఢిల్లీ మంత్రి లేఖ!

Header Banner

కాలుష్యాన్ని తగ్గించాలంటే అదొక్కటే పరిష్కారం! కేంద్రానికి ఢిల్లీ మంత్రి లేఖ!

  Tue Nov 19, 2024 15:24        India

కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే కృత్రిమ వర్షమే పరిష్కారమని, కాబట్టి ఇందుకు అనుమతుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం కూడా దేశరాజధానిని పొగమంచు కమ్మేసింది. గాలి ఏక్యూఐ 494గా నమోదు కాగా... ఎనిమిది ప్రాంతాల్లో 500 కూడా దాటింది. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.  

 

ఇంకా చదవండినేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నేపథ్యంలో గోపాల్ రాయ్ లేఖ రాశారు. ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేస్తోందని, దీని నుంచి విముక్తి కలిగించాలంటే కృత్రిమ వర్షమే పరిష్కారమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ప్రధాని మోదీ బాధ్యత అన్నారు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. కృత్రిమ వర్షంపై కేంద్రానికి గత కొన్ని రోజులుగా లేఖలు రాస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి... తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.లక్షా 80 వేల జీతంతో సొంత జిల్లాలో ఉద్యోగం! పరీక్ష లేకుండా నేరుగా జాబ్ పొందండి! అస్సలు మిస్ అవ్వదు!

 

మంత్రివర్గం పలు బిల్లులకు గ్రీన్ సిగ్నల్! ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ!

 

టీటీడీ కీలక నిర్ణయం! నిత్య అన్నప్రసాదం మెనులో అదనంగా మరో పదార్థం!

 

ఏపీ శాసనసభలో ఏడు కీలక బిల్లులకు ఆమోదం! నూతన మార్పులకు గ్రీన్ సిగ్నల్!

 

మార్చికల్లా మరో 500 ఎస్బీఐ శాఖల ప్రారంభం! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారాకొత్త విధానం - మంత్రి కీలక వ్యాఖ్యలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #India #Pollution #AirPollution #Delhi