సంబరాలకు రెడీ అయిన బీజేపీ! ప్రధాన కార్యాలయంలో జిలేబీల తయారీ!

Header Banner

సంబరాలకు రెడీ అయిన బీజేపీ! ప్రధాన కార్యాలయంలో జిలేబీల తయారీ!

  Sat Nov 23, 2024 12:38        India

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ముందంజలో ఉంది. జార్ఖండ్ లోనూ జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమికి ఎన్డీఏ గట్టి పోటీ ఇస్తోంది. ఈ ఫలితాల ట్రెండింగ్ మధ్యలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి కన్పిస్తోంది. అయితే, ఈ సానుకూల ఫలితాల మధ్య బీజేపీ గెలుపు సంబరాల ట్రెండ్ ని మార్చింది. లడ్డూలతో కాకుండా జిలేబీలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇకపోతే, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా.. మహారాష్ట్రలో అధికార మహాయుతి క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లోంది. మొత్తం 215 స్థానాల్లో అధికార మహాయుతి ఆధిక్యంలో ఉండగా.. 3 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. కాగా.. ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి నేతృత్వంలోని జేఎంఎం 50 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీఏ 30 స్థానాల్లో ముందంజలో ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #India #Politics #Maharastra #BJP #Elections