బహరైన్ పౌరుల మనసు దోచుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 30 వారాలుగా స్వచ్ఛ బహరైన్ పేరిట! సముద్ర తీరాలు, రోడ్లు క్లీనింగ్!
Fri Sep 06, 2024 20:12 Bahrainబహరైన్ లో స్వచ్ఛ బహరైన్ / తెలుగు వారియర్స్ 30 వారాల వేడుకలు
మహాత్మాగాంధీ ఆశయసాధనలో భాగంగా మాన్యశ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి మానసపుత్రిక స్వచ్చ భారత్ స్పూర్తితో ప్రవాస భారతీయులు తెలుగు వారియర్స్ గ్రూపు పాస్టిక్ నుండి పర్యావరణాన్ని, సముద్రాలను కాపాడాలని స్థాపించిన “ స్వచ్ఛ బహరైన్ “ 30 వారాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు మరియు తెలుగు ప్రముఖులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేశారు.
కర్మభూమి రుణం కొంతైనా తీర్చుకోవాలని చేస్తున్న ఈ కార్యాక్రమం 30 వారాలుగా చేస్తున్నందుకు కమిటి సభ్యులకు, స్థాపనకు ముఖ్యకారకులు అయిన శ్రీ కోటగిరి నవీన్ కుమార్ గారికి, 30 వారాలు క్రమం తప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్న కెప్టెన్ మహేష్ మీరా కి ధన్యవాదాలు తెలియచేసారు వ్యవస్థాపకుల్లో ఒకరైన కొత్తపల్లి రామ మోహన్.
ఇంకా చదవండి: రేషన్, ఆధార్ లేకపోయినా బాధ లేదు! ఉచితంగానే బియ్యం, నూనె, కందిపప్పు! ఎలా అని అనుకుంటున్నారా?
వ్యవస్థాపక ముఖ్యసభ్యులు కోటగిరి నవీన్ కుమార్ మాట్లాడుతూ బారతీయులకు అన్నివిధాల సహకరిస్తున్న బహరైన్ ప్రభుత్వానికి, సహకారం అందిస్తున్న తెలుగు సంఘాల వారికి, తెలుగు కళా సమితిసభ్యులకు, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహరైన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. స్వచ్చ బహరైన్ స్థాపనక గల కారణాలను, కమిటీ విది విధానాలను, లక్ష్య సాధనకు తెలుగు వారందరూ కలిసి పనిచేయాలన్న అవశ్యకతను తెలియచేసారు.
తెలుగు కళా సమితి అధ్యక్షులు జగదీష్ గారు, రఘునాథ బాబు, మురళి కృష్ణ, హరి బాబు, ప్రేమ్ సాగర్, సతీష్, నోముల మురళి, అనిల్ ఆరే, చంద్రబాబు, గంగసాయన్న, రాజ్ కుమార్, రాజ శేఖర్ కొత్తపల్లి. వాసుదేవ రావు, రాయుడు వెంకటేశ్వర రావు, సురేష్, శ్రీ రామ్, నోయల్, విఠల్ అరే, మహేశ్వేర రెడ్డి, మౌళి, వంశీ కృష్ణ, సందీప్ మరియు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహరైన్ సభ్యులు, తెలుగు ప్రముఖులు హాజరై తెలుగు వారియర్స్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.
ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు వారియర్స్ కమిటీ సభ్యులు నవీన్ కుమార్, రామ మోహన్ కొత్తపల్లి, పెప్సీ అశోక్, గంగాధర్, తిరుపతి, అరవింద్, మహేష్ మీరా, నవీన్, గంగా రెడ్డి, రంజిత్, పరమేశ్వర్, సుమన్, పెప్సీ సుమన్, సతీష్, శేఖర్, వంశీ కృష్ణ, సురేష్, నవీన్ కుమార్, పెప్సీ సురేష్, శ్రీ కుమార్, శ్రీనివాస్, రాజేష్, నరసా రెడ్డి, నరేందర్, రాజు, తిరుపతి గౌడ్, సాయి కుమార్, అజయ్, రవి, శ్యామ్, కిరణ్ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియచేసుకుని స్వీట్స్ పంపిణిచేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన జలవిపత్తుకు తెలుగు వారు అందరూ కలిసి ముఖ్యమంత్రుల సహాయనిధి కి అందరూ సహకరించాలని తెలుగుదేశం బహరైన్ అధ్యక్షులు రఘునాథబాబు కోరడమైనది. స్వచ్ఛ బహరైన్ / తెలుగు వారియర్స్ కమిటీ కి అన్నివిధాల సహాకరిస్తామని తెలుగు కళాసమితి మాజీ అధ్యక్షులు టి హరిబాబు, మురళి కృష్ణ, రాజ శేఖర్ కొత్తపల్లి, వాసుదేవరావు, నోముల మురళి, రాయుడు మరియు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బహరైన్ సభ్యులు తెలియచేసారు.
బహరైన్ లో వివిధ సంఘాల ఆద్వర్యంలో జరిగే గణపతి ఉత్సవాలకు అందరు హాజరై మతసామరస్యాన్ని చాటి దేవుని ఆశీస్సులు పొందాలని తెలుగు కళాసమితి అధ్యక్షులు జగదీష్ రాజ్ కుమార్, గంగాసాయన్న, చంద్రబాబు మరియు పెప్సీ గణేష్ కమిటీ నిర్వాహకులు అశోక్, గంగాధర్, తిరుపతి మరియు పద్మశాలి బహరైన్ కమిటీ సభ్యులు పరమేశ్వర్, వంశీ కృష్ణ తదితరులు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి మంచినీళ్లు , జ్యూస్, స్వీట్స్ ఏర్పాట్లు చేసిన రఘునాద బాబు, అశోక్, అనిల్ ఆరే, శేఖర్, సురేష్ బాబు మరియు మహేష్ గార్లకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియచేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!
ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!
వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!
వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్! ఎందుకో తెలుసా?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Bahrain #BahrainNews #BahrainUpdates #AndhraPradesh #Telangana #IndianMigrants #TeluguMigrants #Gulf #GulfNews #GulfCountries
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.