ఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ సంబరాలు! పెద్దసంఖ్యలో పాలుపంచుకున్న అభిమానులు!
Sun Sep 01, 2024 19:39 Qatarఖతార్ లో నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబిలీ సంబరాలను ప్రవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. అయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయుకులు, శ్రేణులు భారీగా హాజరై, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొన్నారు. గోల్డెన్ జూబిలీ పోస్టర్స్ ను వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సినీ రంగానికి చేసిన సేవను, యాభై వసంతాలుగా ప్రేక్షకులకు అయన పంచిన వినోదాన్ని.. అలరించిన తీరుతన్నులను, పోషించిన ఎన్నో వైరుధ్యమైన పాత్రలను గుర్తుచేసుకొన్నారు. 1974 లో తాతమ్మకల చిత్రంతో,14 ఏళ్ళ ప్రాయంలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం, ఎన్నో సాంఘీక, జానపద, పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకొని, తన తండ్రి.. తెలుగువారి ఆరాధ్యదైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తారకరాముడికి నటవారసుడిగా చెరగని ముద్రవేసుకొన్నారని కొనియాడారు.
ఇంకా చదవండి: రఘురామ టార్చర్ కేసులో జగన్ కు పిలుపు? అప్పట్లో సీఐడీ కస్టడీలో..
కొన్ని కొన్ని పురాణ పాత్రలు ఆయనకోసమే పుట్టాయా.. అనేవిధంగా.. ఆపాత్రలలో ఆయన పరకాయప్రవేశం చేసారని, భైరవదీపం సినిమాలో కురూపి వేషం, ఆదిత్య 369 లాంటి సినిమాలు, మంగమ్మగారి మనవడు, మువ్వా గోపాలుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మినరసింహ, సింహ, లెజెండ్, అఖండ లాంటి చిత్రాలలో ఆయన నటన అనితర సాధ్యం అని ప్రశంచించారు.
ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ నుంచి, బెస్ట్ ఆక్టర్ గా.. మువ్వా గోపాలుడు, ఆదిత్య 369,నరసింహ నాయుడు, సింహ, శ్రీ రామ రాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, భగవంత్ కేసరి కి దక్కాయి.. ఇక ఎన్నో నంది అవార్డ్స్, ఇతర అవార్డ్స్ ఆయనను వరించాయి అని చెప్పుకొచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు.. ప్రపంచమంతా తిరిగి, బెస్ట్ అఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ని తెచ్చి పేదవాడి ప్రాణాలను కాన్సర్ మహమ్మారి నుంచి కాపాడుతున్న మహోన్నతుడు అని ప్రశంచించారు. రాజకీయ రంగానికి సైతం నేనున్నాని పేదలకు పెన్నిధిగా... బడుగు బలహీన పక్షపాతిగా వారికీ యెన్నుదండుగా ఉంది చేస్తున్న సేవలు కీర్తించారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున్న ఘనవిజయం చేయుటలో కీలక భూమిక పోషించిన గొట్టిపాటి రమణయ్య, మల్లిరెడ్డి సత్యనారాయణ, రమేష్ దాసరి, శాంతయ్య యరమంచిలి, రజని, మరియు ఇతర నాయకులను,అభిమానులను అభినందించారు. డైమండ్ జూబిలీ సంబరాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా చేసుకోవాలని..ఆయన త్రండ్రి మరియు భగవంతుని ఆశీర్వాదం ఆయనకు మెండుగా ఉండాలని కోరుకొంటూ... జై బాలయ్య నినాదాలతో.. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కీలక పదవుల్లో ఉన్నవారికి షాక్! ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా ఉన్నవారికి బదిలీ ఆదేశాలు!
మందుబాబులకు అదిరే శుభవార్త! చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!
రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Qatar #QatarNews #Gulf #GulfNews #GulfCountries #GulfUpdates #QatarUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrant
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.