గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు

Header Banner

గుడివాడ: ఎన్నికల ప్రచారంలో కొడాలి నానికి చేదు అనుభవం! నిలదీసిన మహిళ! సమాధానం లేక రూ. 50 వేలు డబ్బులు

  Thu Apr 25, 2024 09:55        Politics

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం రాత్రి కొడాలి నాని వచ్చారు. గ్రామంలో ఓ ఆలయానికి సహాయం చేస్తానని గతంలో కొడాలి నాని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని గ్రామస్థులు నాని వద్ద ప్రస్తావించారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు స్పందిస్తూ ఆయనేంటి చేసేది.. కోతలు తప్ప ఏ పనులూ చేయడం చేతకాదు అన్నారు. దీంతో నాని వెంట ఉన్న పాలేటి చంటి, మరికొందరు అనుచరులు.. వారిపై దాడికి దిగారు. భయభ్రాంతులకు లోనైన యువకులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పర్యటిస్తున్న నాని వద్దకు బాధిత యువకుడి తల్లి వచ్చి.. నా కొడుకుపై నీ మనుషులు దాడి చేశారు...

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీరు చంపేస్తారన్న భయంతో వాడు ఎక్కడికో వెళ్లిపోయాడు.. నా కొడుకును తెచ్చి అప్పగించండి అంటూ నిలదీసింది. దీనితో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని కొడాలి నాని కాసేపు మౌనంగా ఉండి పోయారు. విషయం అల్లరవుతుందనే ఉద్దేశంతో.. మీ ఇంటికి వెళుదాం పద అంటూ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను బుజ్జగించి రూ. 50 వేలు చేతిలో పెట్టి వెనుదిరిగారు.

ఇవి కూడా చదవండి:  

సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తా అన్న హరీష్ రావు! ఎమ్మెల్యే పదవికి స్వస్తి? ఆగష్టు 14 రాత్రి వరకే సమయం

 

ఆస్ట్రేలియా: గత వారం జరిగిన దాడులపై తనిఖీలు! అరెస్ట్ అయిన 12 మంది! ఎక్కువగా యువకులే!

 

ఎన్నికల నామినేషన్ లో పాల్గొన్న NRI TDP ఐర్లాండ్ సభ్యులు! చీపురుపల్లి లో స్వాగతించిన కళ వెంకట రావు!

 

గుంటూరు ఎంపీ అభ్యర్థి ఆస్తులు విలువ! తెలిస్తే అవాక్ ఆవ్వాల్సిందే! ఎన్ని వేల కోట్లు అంటే ఇండియా, అమెరికాలో!

 

 Evolve Venture Capital 

 

రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు! ఈ 20 రోజలు మనకు ఎంతో కీలకం..చంద్రబాబు

  

స్టేఆర్డర్ కాపీ తెచ్చేలోగానే ఇల్లు కూల్చేశారు! యువనేత ఎదుట ఓ ప్రముఖుడి ఆవేదన! చేనేతలపై ప్రత్యేక ప్రేమ

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 


   #KodaliNani #Gudiwada #AndhraPravasi #Pravasi #TeluguMigrants #2024Election #Politics