పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు!

Header Banner

పల్నాడు ప్రజల పాలిట పెన్నిధి! ఆస్తిలో సగానికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్! యువ రాజకీయవేత్తలకు ఆదర్శం శ్రీ కృష్ణ దేవరాయలు!

  Fri Apr 26, 2024 16:36        Politics

ఇటీవల నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అసలు ఆయన లైఫ్ స్టోరీ ఏమిటి, పొలిటికల్ కెరియర్ ఎలా మొదలైంది. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య - నిర్మల దంపతుల కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. 1983లో జన్మించారు. ఎంతో క్రమశిక్షణతో పెంచారు లావు రత్తయ్య. ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ నుండి మీడియా స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి తండ్రి వ్యాపారాలను చూసుకోవడంలో బిజీ అయ్యారు. విజ్ఞాన్ విద్యా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకున్నారు.

 

తన తండ్రికి రాజకీయాలు అంటే ఆసక్తి ఉండడంతో 2019 కి ముందు తండ్రి కొడుకులు ఇద్దరు వైసీపీలో చేరారు. అక్కడినుండి ఆయన రాజకీయ జీవితం మొదలైంది. వైసీపీలో ఎంతమంది రాజకీయ వారసులు చేరినా, వారందరిలో శ్రీకృష్ణ దేవరాయలు భిన్నమైన వాడు. బాగా చదువుకున్నవాడు, క్రమశిక్షణ కలిగినవాడు, స్థానికంగా మంచి పేరు, విజన్ ఉన్న వ్యక్తి. కాబట్టి వైసిపి అధినేత జగన్ పిలిచి మరీ నరసరావుపేట సీట్ ఇచ్చారు. ఎంతో సీనియర్ నాయకుడైన రాయపాటి సాంబశివరావు మీద ఎంపీగా పోటీ చేసి 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

 

35 ఏళ్ల వయసులో రాజకీయాల్లో అడుగుపెట్టి ఘనవిజయం సాధించి పార్లమెంట్లో కూర్చున్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఐదేళ్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. రైతు సమస్యలు, స్థానిక సమస్యలు తీర్చడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేంద్రం నుండి నిధులను సాధించి నరసరావుపేట సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులను అందజేయగలిగాడు. అటు వ్యాపారాలను ఇటు రాజకీయాన్ని ఎంతో బాధ్యతతో నిర్వర్తించాడు. ఏడాదికి 30 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల చదువు కోసం స్కాలర్షిప్ రూపంలో అందజేస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పల్నాడు ప్రాంత చిరకాల కోరిక మరియు ఆ ప్రాంత భూములను సస్యశ్యామలం చేయగల "వారికపూడిసల" ప్రాజెక్టు ను కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించగలిగారు. అదేవిధంగా పల్నాడులో పిడుగురాళ్ల పట్టణానికి మెడికల్ కాలేజీని కూడా సాంక్షన్ చేయించుకోవటం లో ఈయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ రెండు ప్రాజెక్టులు తోపాటు మరెన్నో అభివృద్ధి పనులు కూడా ఆయన స్వయంగా పూనుకొని చేయగలిగారు. వైసిపి పార్టీ మరియు ఆ పార్టీ అధినేత తీరు నచ్చక చంద్రబాబు గారి కార్యదీక్షతను మరియు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణను చూసి తను ఈ పార్టీలో చేరానని పలు సభల్లో కూడా చెప్పారు.

 

ఇక శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్తుల విషయానికి వస్తే, తాను, తన భార్య, మరియు తన కుమారుడు పేరు మీద స్థిర, చరాస్తులు అంని కలిపి 56.65 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా వీరికి అప్పులు 6.8 కోట్ల రూపాయలు ఉన్నాయి.

 

పార్టీ తో సంబందం లేకుండా ఈ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో ప్రొజెకట్లకు నిధులను సేకరించగలిగారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో యువత రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. అలాంటి వారికి శ్రీ కృష్ణ దేవరాయలు ఎంతో ఆదర్శంగా నిలుస్తాడు. అలాంటి వ్యక్తిని మనం దేశ పార్లమెంటుకు పంపితే అది మన పల్నాడుకు, మన రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి మరియు మన నాయకుడు చంద్రబాబుకి గర్వకారణం అవుతుంది. దానికి మనం తప్పకుండా ఓటు వేసి గెలిపించుకోవడానికి తప్పకుండా కృషి చేయాలి.

 

ఇవి కూడా చదవండి:

ఈవీఎం- వీవీఫ్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! అభ్యర్థులు కోరితే ఆ అవకాశం 

 

జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల! ఆంధ్రకు సీఎంగా ఏం పీకావ్! ఆంధ్ర ను అడుక్కునేలా చేసావ్ 

 

వివాదంలో కొడాలి నాని నామినేషన్! ఆర్వో నిర్ణయంపై సర్వత ఉత్కంఠ! టీడీపీ నేత తులసి ఫిర్యాదు 

 

పిచ్చిమందుతో పేదల జీవితాల్ని జగన్ బలిపీఠం.. రూ.3.14 లక్షల కోట్ల ప్రజా కష్టార్జితాన్ని..ప్రత్తిపాటి పుల్లారావు 

 

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం! ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు.. 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TDP #YCP #Politics #LavuSriKrishnaDevarayalu #Narasaraopet #NRT #Elections #NRTMP