ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో!

Header Banner

ఎన్నారై టిడిపి ద్వారా లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు! 5,000 మంది ఎన్నారై లతో NRISE -AP ప్రచార కార్యక్రమం ప్రారంభం! డా. రవి వేమూరి ఆధ్వర్యంలో!

  Fri Apr 26, 2024 20:51        Politics

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు అనగా 26 ఏప్రిల్ న ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో రాష్ట్రంలోని యువతకు లక్ష అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమ వివరాలలోకి వెళితే...

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిడిపి ఎన్నారై సభ్యులు రాష్ట్ర అభివృద్ధి కొరకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు. అందులో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో NRISE-AP అనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నేతలతో పాటు పలువురు ఎన్నారై టిడిపి సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నారై టిడిపి సెల్ అధ్యక్షుడు వేమూరు రవి కుమార్ మాట్లాడుతూ స్థానిక మరియు గ్లోబల్ కంపెనీలలో యువతకు లక్ష ఇంటర్నేషనల్ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఎన్నారైలు NRISE-AP ప్రచారంలో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలు మరియు 25 లోక్ సభ స్థానాలలో ఉన్న యువతను ఎన్నారైలు స్వయంగా కలసి టిడిపి గెలుపు ఎంత ముఖ్యమో అని ప్రచారం చేస్తారు.

 

ఇకపోతే, గత 2 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపవర్మెంట్ సెంటర్ ను స్థాపించి, ఈ సెల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే క్రమంలో వివిధ నైపుణ్యాభివృద్ది రంగాలలో ఉచిత శిక్షణ ఇచ్చి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇందులో భాగంగా ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి గల్ఫ్ దేశాలలో, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని యూఎస్ఏ అనుబంధ కంపెనీలలో ఇప్పటికే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

 

బీఈడీ పూర్తిచేసిన టీచర్లకు యూఎస్ఏ లో టీచర్ ఉద్యోగాలకు శిక్షణ ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది.

 

హోటల్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి యూఎస్ఏ లో ఇంటర్న్ షిప్ కొరకై ఇక్కడ శిక్షణ పొందారు. వారిలో చాలా మంది యూఎస్ఏ వెళ్లి ఇంటర్న్ షిప్ చేస్తున్నారు.

 

B. Tech పూర్తిచేసిన వారికి Java, phython, Data analatics, వెబ్ డెవలప్మెంట్ వంటి software కోర్సులు నేర్పి మంగళగిరిలో ఉన్న USA అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

 

Degree పూర్తిచేసిన వారికి డిజిటల్ మార్కెటింగ్, Tally, HR Recruitment కోర్సులు నేర్పించి వివిధ రకాలైన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

 

ఈ కోర్సులతో పాటుగా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్,  అవసరమైన వారికి ఇంగ్లీష్, హిందీ, అరబిక్ భాషలు కూడా నేర్పిస్తున్నారు. ఈ శిక్షణలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జరగటం ఒక విశేషం.

 

జగన్ పై వంగవీటి రాధా ఘాటు వ్యాఖ్యలు!! ఆయన బతికినంత కాలం ప్రజల కోసమే బతికారు!! మరో 20 రోజులు సైనికుల్లా 

 

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కావాల్సిన గైడెన్స్, అక్కడకు వెళ్లిన తర్వాత వారికి కావలసిన కనీస అవసరాలను, మరియు పార్ట్ టైం ఉద్యోగాలను అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుల చేత సహాయం అందించే విధంగా కో-ఆర్డినేషన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వర్క్ ఫ్రం హోం జాబ్ ఆఫర్లు కూడా సృష్టింకి దానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ లకు శిక్షణ ఇస్తున్నారు.

 

తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగానే ఇన్ని రకాలైనటువంటి జాబ్ ఉద్యోగాలు కల్పన జరుగుతుండగా రేపు తెలుగుదేశం వస్తే రాబోయే కాలంలో కనీసం లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు కల్పించబోతున్నాము అని టిడిపి తరఫున ఎన్నికల ప్రచారంలో ప్రవాసాంధ్రులు ఈ NRISE-AP అనే ప్రచార క్యాంపెయిన్ ను ఎన్ఆర్ఐ టిడిపి ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు కనీసం మూడు నియోజకవర్గాలలో టిడిపి తరఫున వీరు ప్రచారం చేస్తారు. వీరంతా వేర్వేరు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర నలుమూలల ప్రచారంలో పర్యటించాలని ప్రణాలిక ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5000 మంది కి పైగా ఎన్నారై టిడిపి సభ్యులు వచ్చి ఈ ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అని తెలిపారు.

 

ఉద్యోగాల కొరకు లేదా ట్రైనింగ్ ప్రోగ్రాంలో కొరకు ఎన్నారై టిడిపి సెల్ నిర్వహిస్తున్న ఎంపవర్మెంట్ సెంటర్లో నమోదు చేసుకోవాలనుకున్న వారు www.nritdp.com సందర్శించి మరిన్ని వివరాలు తెలుసు కోవాల్సిందిగా ఈ సందర్భంగా కార్య నిర్వాహకులు తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి:

ఈవీఎం- వీవీఫ్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు! అభ్యర్థులు కోరితే ఆ అవకాశం 

 

జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల! ఆంధ్రకు సీఎంగా ఏం పీకావ్! ఆంధ్ర ను అడుక్కునేలా చేసావ్ 

 

వివాదంలో కొడాలి నాని నామినేషన్! ఆర్వో నిర్ణయంపై సర్వత ఉత్కంఠ! టీడీపీ నేత తులసి ఫిర్యాదు 

 

పిచ్చిమందుతో పేదల జీవితాల్ని జగన్ బలిపీఠం.. రూ.3.14 లక్షల కోట్ల ప్రజా కష్టార్జితాన్ని..ప్రత్తిపాటి పుల్లారావు 

 

మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేశ్ ప్రచారం! ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు.. 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TDP #NRITDP #Jobs #Employment #Politics #Youth #Empowerment #JobOppurtunities