ఎన్నారై లకు సమయం కేటాయిస్తాను - చంద్రబాబు! ఆత్మీయ సమావేశంలో! పెమ్మసాని, యార్లగడ్డ, బోడె ప్రసాద్, రామాంజనేయులు, నన్నపనేని!

Header Banner

ఎన్నారై లకు సమయం కేటాయిస్తాను - చంద్రబాబు! ఆత్మీయ సమావేశంలో! పెమ్మసాని, యార్లగడ్డ, బోడె ప్రసాద్, రామాంజనేయులు, నన్నపనేని!

  Wed May 15, 2024 18:32        Politics

NRI TDP సభ్యులతో సమావేశం: మే 14, 2024న, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో NRI TDP సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఎన్నారై టిడిపి సభ్యులు అందరినీ గుర్తించి వారందరికీ కృతజ్ఞతలు తెలపడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రవి వేమూరు సారథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పెనమలూరు నియోజకవర్గం అభ్యర్థి బోడే ప్రసాద్, గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ప్రత్తిపాడు అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ మరియు టిడిపి ఆఫీస్ ఇంచార్జ్ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే మరియు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ప్రముఖ నాయకుడు మన్నవ సుబ్బారావు, బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, ఎన్ఆర్ఐ టిడిపి అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం, అమెరికా ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ మల్లిక్, ఎన్నారై టీడీపీ గర్ల్స్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ తో పాటు ప్రెసిడెంట్ వేమూరు రవికుమార్ హాజరయ్యారు.

 

 

అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఖతార్, కువైట్, ఒమాన్, దుబాయ్, సౌదీ ఆరబియా, బహరేన్, లండన్, ఐర్లాండ్, స్వీడన్ వంటి పలు దేశాల నుండి వచ్చిన ఎన్నారై లు సమావేశం లో పాల్గొన్నారు.

 

సమావేశానికి వచ్చిన ఎన్ఆర్ఐలను ఉద్దేశించి కువైట్ నుంచి వెంకట్ కోడూరి, అమెరికా నుండి భాను, ఆళ్ళ వెంకట్, ఆస్ట్రేలియా నుంచి నవీన్ తోపాటు మరి కొందరు మాట్లాడుతూ వారి వారి ఎలెక్షన్ క్యాంపైన్ అనుభవాలను పంచుకున్నారు.

 

కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏపీ ఎన్ఆర్టీ గా మొదలై ఎన్నారై లు అందర్నీ ఒక వేదిక మీదకు తీసుకు వచ్చింది. కోవిడ్ తర్వాత అది ఎన్నారై టిడిపి గా ఆవిర్భవించి ఎందరో ఎన్నారై లను ఏకం చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేశారు. పార్టీ గెలుపు కోసం ఇంతమంది కష్టపడడం చాలా ఆనందంగా ఉంది, ఇదే స్ఫూర్తితో పార్టీ గెలిచిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నారైలు అందరూ సహకరించాలి అని అన్నారు.

 

ఎన్ఆర్ఐ టిడిపి ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మాట్లాడుతూ ఎన్నారైల ద్వారా రాష్ట్రానికి ఏ విధంగా మంచి జరుగుతుందో గుర్తించి దానిని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగమైన ప్రతి ఒక్క ఎన్నారై కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. అర్హత ఉన్న యువతకు పలు రంగాలలో ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలను కల్పిస్తున్నారు. మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని వీవర్స్ శాలను ఏర్పాటు చేశారు. ఒక షెడ్ ను ఏర్పాటు చేసి, వారి జీవన ఉపాది కి అండగా ఉన్నారు. ఈ సందర్భంగా చేనేత చీరలను ప్రోత్సహించాలని, కార్మికులకు చేయూత అందించాలని తమకు సహాయం అందించిన ఆఫీస్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మరియు సెక్యూరిటీ స్టాఫ్ కు 2,000 రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరిగింది. ఈ హ్యాంపర్ తో వీవర్స్ శాల లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు. ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్న ఎన్నారైలకు ప్రోత్సాహకరంగా అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్ లు అందించడం జరిగింది. అలాగే లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ కు ప్రణాలికను ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. అదేవిధంగా విదేశాలలో స్థిరపడ్డ వారి కంపెనీ లను ఇక్కడ కూడా ప్రారంభించడానికి కృషి చేస్తున్నాము అన్నారు.

 

పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్ మాట్లాడుతూ సీటు రాకపోయినా కుడా దాదాపు లక్ష మంది ఎన్నారైలు నాకు సపోర్ట్ చేసారు. ఆ మేలు మర్చిపోలేను, వీరి అందరి రుణం తీర్చుకుంటాను అన్నారు.

 

గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ వేరే దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడినా కూడా అక్కడి పౌరసత్వం తీసుకోకుండా ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము అన్నారు. ఈ ఎన్నికలలో ఎన్నారై ల తోడ్పాటు ఎంతగానో ఉంది అన్నారు.

 

ఎన్ఆర్ఐ టిడిపి అమెరికా కోఆర్డినేటర్ కోమటి జయరాం మాట్లాడుతూ మొత్తం 10,000 మంది ఎన్నారై లు ఓటు వేయడానికి తిరిగి స్వదేశానికి వచ్చారు. జీవిత కాలం లో ఈ ఎన్నికలకు రికార్డు స్థాయిలో ఎన్నారైలు వచ్చారు అన్నారు. తమ సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.

 

గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ మహాత్మా గాంధి ఒక ఎన్నారై, అంబేత్కర్ ఎన్నారై, స్వాతంత్ర ఉద్యమంలో అంత కీలక పాత్ర పోషించారు. నేను ఎన్నారై నే, ఈ అరాచకాలను, ఈ విధ్వంసాన్ని ఒక అవకాశంగా తీసుకొని మనం పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఈ పరిస్థితి రాకపోతే మనం అందరం ఏకం అవ్వడానికి అవకాశం ఉండేది కాదు. విధ్వంసం లోనుంచే అభివృద్ధి వస్తుంది. ఈ ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది అన్నారు. ఈ విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు అభివృద్ధిని చేసుకుంటూ పోతాము. దానికి నా తరపు సహాయం ఎప్పుడూ ఉంటుంది అన్నారు. అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకొని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడతాము. రాష్ట్రంలో గుంటూరును మోడల్ సిటీ గా తీర్చిదిద్దుతాను అన్నారు.

 

అమెరికా ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ మల్లిక్ మాట్లాడుతూ అమెరికా లో ఉన్న కంపెనీ లతో చర్చిస్తున్నాము. పార్టీ అధికారంలోకి రాగానే యువతకు లక్ష అంతర్జాతీయ ఉద్యోగాలు కల్పించడం లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాము అన్నారు. 

 

జూమ్ కాల్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల విజయం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి చర్చించారు. వెంకట్ కోడూరి, మాలేపాటి సురేష్ బాబు నాయుడు చంద్రబాబు కు స్వాగతం చెప్తూ వారి అనుభవాలను పంచుకున్నారు. వారితో పాటు పెమ్మసాని, కోమటి జయరాం, రవి వేమూరి మీటింగ్ గురించి చంద్రబాబు కు వివరించారు. రాష్ట్రానికి వారు చేసిన విశేషమైన కృషిని ఆయన గుర్తించి కృతజ్ఞతలు చెప్పారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలతో భవిష్యత్ తరాలకు మద్దతు ఇవ్వడంలో వారి ప్రాముఖ్యత ఉంటుంది అన్నారు.

 

రాష్ట్ర ప్రగతికి ఎన్నారైల ఆశీస్సులు, మద్దతు ఎంతో కీలకమని వ్యాఖ్యానిస్తూ "ఆంధ్రప్రదేశ్‌ను రక్షించడం మీ వంతు" అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళను టాప్ ఇన్ఫ్లూయంసర్ లు గా నిలబెట్టాలి, ప్రతి ఒక్కరూ మరొక 10 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి రావాలి అనేది న కోరిక. 2047 కల్లా ఇది సాధ్యం అవ్వాలి అని తెలిపారు.

 

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్త గా వ్యవహరించిన రావి రాధాకృష్ణ ను అందరూ అభినందించారు. చివరిగా విందు భోజనం తో కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.

 

ఇవి కూడా చదవండి: 

పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా! 

 

తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స 

 

నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం 

 

అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #NRIs #NRITDP #Politics #Elections