ABV ని సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా! అంత హీనమైన బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత ప్రజా మద్దతు

Header Banner

ABV ని సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా! అంత హీనమైన బ్రతుకూ ఒక బ్రతుకేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత ప్రజా మద్దతు

  Sun May 19, 2024 16:04        Politics

ABV ని సస్పెండ్ చేసిన మొదట్లో కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు, రాజ్యం అనేది అత్యంత బలమైన వ్యవస్థ, ఒక వ్యక్తిగా దానితో పోరాడలేవు, నిజమేదైనా, న్యాయం నీ పక్షానున్నా, లొంగిపోవడం ఉత్తమం అని. ఈ మధ్యన తానా సభలకు వెళ్ళినప్పుడు చాలా మంది NRI లు కూడా అదే ప్రశ్న అడిగారు. ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు, మీరు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే కదా, అంత పోరాటం అవసరమా అని. దానికి ABV ఇచ్చిన సమాధానం ఒకటే - ఒక మనిషిగా, ఒక ఉద్యోగిగా నన్ను నేను 30 సంవత్సరాలుగా మలుచుకున్నాను. నా విలువలను నేను ఎంచుకున్నాను. అలాగే నడుచుకున్నాను. ఇవాళ ఒక ఆర్ధిక ఉగ్రవాది, ఒక రాజకీయ నేరస్తుడు, ఒక హంతకుడు వచ్చి నన్ను..... , నన్ను ఒక అవినీతి పరుడినని, ఒక దేశ ద్రోహి అని ముద్ర వేస్తే, నేను తలొంచుకుని వెళ్ళిపోతే, నేను మనిషినవుతానా, నడుస్తున్న శవాన్నవుతానా? అంత హీనమైన బ్రతుకూ ఒక బ్రతుకేనా?

 

ఇంకా చదవండి: చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సస్పెన్షన్ లో ఉన్నా గానీ, ABV పోలీసు ఉద్యోగం మానలేదు. వివేకా హత్య కేసు CBI కి ఇచ్చాక సంవత్సరం దాటినా ఏమీ పురోగతి లేని దశలో, ABV, CBI డైరెక్టరుకి రాసిన ఉత్తరం బాంబులా పేలింది. తన దగ్గరున్న వివరాలు ఇస్తాను, ఎవరినయినా పంపమని రెండు సార్లు చెప్పినా ఎవరూ రాలేదని, హత్య కేసు ఇంతవరకూ పరిష్కరించలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి బహిరంగంగా అనేసరికి CBI పూర్తి ఆత్మరక్షణలో పడింది. ఫలితంగా ABV వాంగ్మూలం తీసుకోవడం, అటునుంచి అటే పులివెందుల వెళ్లిన CBI టీం రెండు నెలలు ఆపకుండా చేసిన దర్యాప్తు ఫలితమే వివేకా హత్య కేసు బద్దలవడానికి నాంది. ABV ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా సేకరించిన IPDR (ఇంటర్నెట్ వాడకం రికార్డు) ఆధారంగానే అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఎప్పుడెప్పుడు వాట్సాప్ లో మాట్లాడాడో CBI నిర్ధారించగలిగింది.

 

ఇంకా చదవండి: అమెరికాలో తుఫాన్‌ బీభత్సం... అంధకారంలో నగరాలు! నలుగురు మృతి! విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం!

 

LV సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పీవీ రమేష్ లతో జగన్ ఆడుకున్న తీరు చూసి ప్రభుత్వ ఉద్యోగులంతా బేజారైన సమయంలో, అచ్చెన్నాయుడు, రఘురామకృష్ణంరాజు, కొల్లు రవీంద్ర, రంగనాయకమ్మ, ధూళిపాళ్ల నరేంద్ర, అయ్యన్న పాత్రుడు ల మీదకు పోలీసులను వేట కుక్కల్లా వదిలిన సమయంలో, శుక్రవారం వచ్చిందంటే బుల్డోజర్లు ఎవరి ఇంటి మీదకు వస్తాయో అని వణికే సమయంలో, అత్యంత శక్తివంతుడైన ఒక ఫ్యాక్షనిస్టు మీద ABV తొడ గొట్టిన వైనం నిరాశలో కూరుకుపోయిన లక్షలాది మందిలో ఒక ధైర్యాన్ని, ఒక పోరాట పటిమను నిలబెట్టింది. ఫర్వాలేదు, పోరాడి నిలవొచ్చు అనే ఒక ఆశా కిరణం ABV రూపంలో కనిపించింది. అందుకే ఈ రోజు ABV కోసం ఇంత మంది తపిస్తున్నారు. ఒక్క రోజు ముగియకముందే 15,000 మంది ఆన్లైన్లో దేశ విదేశాలనించి #JusticeforABV అంటూ మొదలెట్టిన కాంపెయిన్ కి మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత ప్రజా మద్దతు అసాధారణం. ఇది ABV గొప్ప కాదు. అయన చూపిన తెగువ, ఆ తెగువ వెనుక ఉన్న నిజాయితీ, ధైర్యం ల గొప్ప. ఆ విలువలకి సమాజంలో, ప్రజల్లో ఈ మాత్రం విలువ ఉండటం ఎంతో సంతోషించతగ్గ విషయం. అంతా చెడిపోయారు అనే నిస్పృహ నుంచి ఒక ఊరట.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #APgovrnment #Employe #AndhraPradesh #APNews #IPS #ABV