58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!

Header Banner

58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!

  Sat May 25, 2024 07:48        Politics

లోక్‌సభ ఎన్నికలు-2024లో ఆరవ దశ పోలింగ్ పోలింగ్ ఈ రోజు (శనివారం) ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్‌ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.  6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్‌లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూ కాశ్మీర్‌లో 1 సీటు, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 

 

ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అనంతనాగ్-రాజౌరి నుంచి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సోమనాథ్ భారతి, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్. 

 

ఆరో దశ పోలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అధికారి బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని 7 స్థానాలపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాలు, ఆప్ 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఐదు విడతల పోలింగ్ పూర్తవ్వగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. నేడు (శనివారం) 6వ దశ పోలింగ్ ముగిస్తే మరొక్క దశ మాత్రమే మిగిలివుంటుంది. జూన్ 1తో ఏడవ దశ పోలింగ్ కూడా ముగుస్తుంది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.

 

ఇవి కూడా చదవండి: 

ప్రపంచ వ్యాప్తంగా AI నిపుణుల వేతనం సరాసరి 50% పెరుగుదల! పోటీ పడుతున్న దిగ్గజ కంపెనీలు! శాలరీ ₹2.5 కోట్లు! 

 

హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్! 

 

జగనన్నా, మహిళల గురించి మైకుల ముందు గొంతు చించుకొని ముసలి కన్నీరు కార్చావు! లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్న నీకు ఇప్పుడు వారి ఆర్తనార్థాలు వినపడట్లేదా! షర్మిల ట్వీట్ 

 

అమెరికా లో మరో దారుణం! బైక్ యాక్సిడెంట్ లో తెలుగు విద్యార్ధి మృతి! మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో ఎంబసీ, తానా టీం స్క్వేర్! 

 

పిన్నెల్లి పై హైకోర్టు తీవ్ర ఆంక్షలు! నియోజకవర్గానికి వెళ్ళకూడదు! ఎవరితో మాట్లాడకూడదు! EC ప్రతి కదలిక గమనించాలి! 

 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

 

ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో! 

 

ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర! 

 

సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా! 

 

జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం! 

 

వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్! 

 

హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే! 

 

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్! 

 

తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే! 

         

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #India #Elections #Voters