సినిమా తీసేదాక ఆయనెవరో ప్రపంచానికి తెలీదు! గాంధీ పై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు! స్పందించిన రాహుల్ గాంధీ!

Header Banner

సినిమా తీసేదాక ఆయనెవరో ప్రపంచానికి తెలీదు! గాంధీ పై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు! స్పందించిన రాహుల్ గాంధీ!

  Thu May 30, 2024 07:45        Politics

మహాత్మా గాంధీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మన జాతిపిత గాంధీపై సినిమా వచ్చే వరకు ఆయన గురించి ప్రపంచానికి తెలియదని మోడీ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గాంధీ గురించి ప్రపంచానికి తెలియజేసే బాధ్యత దేశనాయకులదే అన్నారు. గాంధీ జీవితం, సిద్ధాంతాల గురించి తీసిన మూవీ ఆధారంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు అయితే.. గాంధీని కూడా అలా మార్చేందుకు కృషి చేయాల్సిందన్నారు. మహాత్ముడిపై మరింత దృష్టి సారించి ఉంటే బాగుండేదన్నారు. దేశంలోని ఎన్నో సమస్యలకు గాంధీ దగ్గర పరిష్కారం ఉందన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే, మోడీ చేసిన ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. మహాత్ముడి వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది. గాంధీ పేరుతో ఉన్న సంస్థలను కేంద్రమే ధ్వంసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్టు చేశారు. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్ లో గాంధీ పేరుతో ఉన్న సంస్థలు ధ్వంసం చేశారని మండిపడ్డారు.

 

దుబాయ్ సందర్శించాలి అనుకుంటున్నారా! అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి! చాలా డబ్బు సేవ్ చేయవచ్చు! 

 

మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలంటే 'ఎంటైర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్' మాత్రమే మూవీ చూడాలి అని పేర్కొన్నారు. పరోక్షంగా ప్రధాని మోడీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని ఉద్దేశించే ఎంటైర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. ఇకపోతే, మహాత్ముడి జీవితం ఆధారంగా 1982లో 'గాంధీ' చిత్రం వచ్చింది రిచర్డ్ అటెన్బరో డైరెక్షన్ వహించిన ఈ మూవీలో బెన్ కింగ్స్లో గాంధీపాత్రలో నటించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో ఆ మూవీకి అకాడమీ అవార్డులు వచ్చాయి.

 

ఇవి కూడా చదవండి: 

సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు! 

 

10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి! 

 

కువైట్: సంక్షేమం ఖర్చు రికార్డు స్థాయిలో 1వ స్థానం! తర్వాత జర్మనీ, స్వీడన్, నార్వే! చిన్న దేశంలో అంత సంక్షేమం, తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

తెలుగు తమ్ముడికి 8 కోట్లు - దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుపు! మరో ఇద్దరు భారతీయులకు కారు, బైకు! అదృష్టం ఉంటే అలా ఉండాలి 

 

కెనడా: ఆ దేశవాసుల కోసం వర్క్ పర్మిట్ ఫీజు అవసరం లేదు! ప్రజాసేవలో ప్రభుత్వం! ఇన్సూరెన్స్ కూడా కొన్నాళ్లపాటు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్ US కు రికార్డ్ స్థాయిలో ఆపరేషన్‌స్! రోజుకి గరిష్టంగా ఎన్ని అంటే! అతికొద్ది కాలంలోనే! 

 

కెనడా: అర్ధాంతరంగా 600 భారతీయుల ఉద్వాసన! ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంపూర్ణ నిరాహార దీక్ష తో ఉద్రిక్తతలు! ప్రశ్నార్ధకంగా మారిన వారి జీవితాలు 

 

ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే! 

 

ప్రజలపై ఇప్పటికే ఉన్న భారం సరిపోదు అన్నట్లు! కొత్తగా ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు! అప్పులతో మునిగిపోతున్న ఏపీ! 

                                            

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #BJP #Congress #Modi #RahulGandhi