అయ్యో.. బొత్స ఎంతపని చేశావు!! జగన్ కు కూడా తెలీదా? గవర్నమెంట్ ఎంప్లాయిస్ తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా!

Header Banner

అయ్యో.. బొత్స ఎంతపని చేశావు!! జగన్ కు కూడా తెలీదా? గవర్నమెంట్ ఎంప్లాయిస్ తో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా!

  Sat Jun 08, 2024 10:47        Politics

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీలపై గత వైసీపీ ప్రభుత్వం ముందు ఇచ్చిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఎన్నికల ముందు అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖలోని కొందరు అధికారులు ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని రాత్రికిరాత్రి బదిలీలు చేశారు. ఈలోపు ఎన్నికల కోడ్‌ రావడంతో టీచర్ల బదిలీలకు బ్రేక్​పడింది. దీంతో ప్రభుత్వ టీచర్ల బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణకు డబ్బులిచ్చినా బదిలీలు కాలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు వాపోతున్నారు. బదిలీల సిఫార్సు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచక, ఇచ్చిన డబ్బులు తిరిగిరావని ఆందోళనలో పడ్డారు. దీనిపై కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశముందని ఉపాధ్యాయులు ఆరోపించారు.

 

ఇంకా చదవండి: ప్రజా పక్షపాతి, నిరంతర శ్రామికుడు! అక్షర యోధుడికి కన్నీటి నివాళులు - లోకేష్

 

అసెంబ్లీ ఎన్నికల ముందు కోట్ల రూపాయలు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖలోని కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైఎస్సార్సీపీ మంత్రులు, అదే పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కిందిస్థాయి నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొన్న మంత్రి బోత్స సత్యనారాయణ, ఆయన పేషీలో పనిచేసే పీఏ, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్, సచివాలయంలో పనిచేసే కొందరు అధికారులు కలిసి ఎన్నికల ముందు రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా టీచర్ల బదిలీలు చేశారు. రాజకీయ సిఫార్సు బదిలీలకు ఒక్కో ఉపాధ్యాయుడు రూ 3 లక్షల నుంచి రూ 6 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారని తెలిసింది. వివిధ కారణాలతో వాళ్లు నివాసం ఉంటున్న పట్టణాలు, నగరాల సమీపంలోకి వచ్చేందుకు ఉపాధ్యాయులు ఈ బదిలీలను ఆశ్రయించారు. మంత్రి బోత్సా సత్యనారాయణ, ఆయన పేషీలోని పీఏ, కొందరు విద్యాశాఖ అధికారులు కలిసి దాదాపు రూ. 40 కోట్లకు పైగా బదిలీలు చేస్తామని ఉపాధ్యాయుల నుండి దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బదిలీలు నిలిచిపోవడంతో ఇచ్చిన డబ్బులు కూడా తిరిగిరావని బాధిత టీచర్లు ఆందోళనకు దిగారు.

ఇంకా చదవండి:  వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సైకిల్! ఆపడానికి ఎవరూ సాహసం చేయలేరు! వివిధ చానల్స్ లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ మీకోసం!

 

విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!

 

ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!

 

రియల్​ మీ జీటీ 6టీ.. సోనీ కెమెరా, హైస్పీడ్​ చార్జింగ్, ఇతర ఫీచర్లు, అతి తక్కువ ధరకే! మరియు ఎక్స్ట్రా డిస్కౌంట్!

 

జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?

 

వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!

 

మారుమూల గ్రామంలో జన్మించిన భారతీయుడి ఆస్తి విలువ ₹65,150 కోట్లు! జీరో నుండి ఎదిగిన అతని పేరు ఆ దేశాలలో చెప్తే!

 

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Jagan #GovernmentTeachers #BotsaSatyanarayana