ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు?
Wed Jun 26, 2024 07:00 Politicsఈసారి లోక్ సభ స్పీకర్ ఎన్నిక వ్యవహారం ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా మరోసారి స్పీకర్ పదవి చేపట్టేందుకు నామినేషన్ వేయగా, ఇండియా కూటమి తరఫున కేరళ ఎంపీ సురేశ్ బరిలో దిగుతారని తెలుస్తోంది. ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఎన్డీయే కూటమి అప్రమత్తమైంది. పలు పార్టీలను బయటి నుంచి మద్దతు అందించాలని ఎన్డీయే విజ్ఞప్తి చేస్తోంది. ఎన్డీయేకి లోక్ సభలో 293 మంది ఎంపీల బలం ఉండగా, లోక్ సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తటస్థ పార్టీలను కూడా కలుపుకుని పోవాలని నిర్ణయించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ క్రమంలో, ఏపీ రాజకీయ పక్షం వైసీపీ కూడా ఎన్డీయేకి మద్దతు పలికింది. వైసీపీకి లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. స్పీకర్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్డీయే, చిన్న పార్టీలు, తక్కువ మంది ఎంపీలు ఉండే పార్టీలు అని చూడకుండా, వీలైనంతగా ఎక్కువ పార్టీల నుంచి మద్దతు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ మద్దతుతో ఎన్డీయే బలం 297కి పెరిగినట్టయింది. ఏపీ అధికార పక్షం టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉండగా, వైసీపీ మద్దతు ఇస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఎన్డీయేకి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది.
ఇవి కూడా చదవండి:
రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే!
క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్!
అమెరికాను వీడని వరద ముప్పు! ప్రవాహానికి బద్దలైన డ్యామ్!
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే!
షాకింగ్ న్యూస్! పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం! కారణం అదే!
జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
‘యువగళం’ చానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధమూ లేదు! త్వరలోనే చర్యలు ఉంటాయని హెచ్చరిక!
మీ ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్లు బుక్ చేస్తే జైలుకే! తస్మాత్ జాగ్రత్త!
ఆస్ట్రేలియా: మెల్బోర్న్ లో ఘనంగా కూటమి విజయోత్సవ సంబరాలు! ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #YCP #BJP #JSP #NDA #CentralGovernment #NDAGovernment #Modi #YSJagan #CBN #PawanKalyan #NaraLokesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.