వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు!

Header Banner

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు!

  Thu Jun 27, 2024 08:10        Politics

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పెట్టేందుకు...కేంద్ర మంత్రి తో చర్చలు జరిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుంకట్టింది.

 

ఢిల్లీలో ఎపి బిజెపి పావులు కదిపింది. ఈమేరకు ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి కేబినెట్ మంత్రి కుమార స్వామి తో ఢిల్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం సమావేశమైంది. గతంలో ఇచ్చిన వినతలు ఆధారంగా కుమార స్వామి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కుమార స్వామి బిజెపి నేతలకు వివరించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అందువల్ల ఆంధ్రుల సెంటిమెంట్ ను గౌరవ విస్తు నిర్ణయం ఉండాలన్న విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావిస్తు స్టీల్ ప్లాంట్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తు లాభాల బాటలో కి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు తెస్తు కేంద్రమంత్రి కుమార స్వామి తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు .స్టీల్ ప్లాంట్ ను పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు.

 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందిస్తు అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదేవిషయం పై రెండుమాసాల్లో మరోమారు ఇదేవిధంగా ఒక సమావేశం నిర్వహించుకుందామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కి హామీ ఇచ్చారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి బిజెపి ఎంపి సిఎం రమేష్, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాధరాజులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. 

 

ఇవి కూడా చదవండి 

మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

 

చరిత్రలో తొలిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక! ఓటింగ్ కు 7 గురు ఎంపీలు దూరం! 

  

ఆసక్తికరంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక! ఎన్డీయేకి వైసీపీ మద్దతు? 

 

రైతు భరోసా పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్! కొత్త పేరు అదే! 

 

క్రీడల్లో రాజీకీయ జోక్యం ఉండకూడదు! క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటానన్న లోకేష్! 

  

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‍కు దక్కని ఊరట! కొనసాగానున్న స్టే! 

  

జగన్ బ్రో సైకోఇజం ముందు కిమ్ కూడా పనికిరాడు! గంటా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు! 

                                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #India #BJP #TDP #JSP #Janasena #Modi #CentralGovernment #AndhraPradesh