అప్పుడు అధికార అహంకారంతో విర్రవీగిన జగన్! ఇప్పుడు దర్పం లేక రగిలిపోతున్న మామూలు MLA! అయినా కుక్క తొక వంకరే - బుద్ధి మారదు!

Header Banner

అప్పుడు అధికార అహంకారంతో విర్రవీగిన జగన్! ఇప్పుడు దర్పం లేక రగిలిపోతున్న మామూలు MLA! అయినా కుక్క తొక వంకరే - బుద్ధి మారదు!

  Fri Jun 28, 2024 18:15        Politics

Article: మంజు యనమధల

 

“ఓడలు బండ్లు అవడం, బండ్లు ఓడలు అవడం” అన్న నానుడి మన అందరికి తెలుసు. ఇప్పటికే చాలాసార్లు ప్రత్యక్షంగా చూసాము, చూస్తున్నాము కూడా. కాలాన్ని మన చేతిలో ఉంచేసుకుందామనుకుంటే ఎలా కుదురుతుంది? కాలం చేతిలో మనం కీలుబొమ్మలమే కాని కాలాన్ని శాసించే శాసకులం కాదు. ఈ విషయం తెలిసి కూడా మిడిసిపడితే “చివరకు మిగిలేది” ఏంటన్నది మన కనుల ముందున్న ఫలితాన్ని చూస్తే అర్థం అవుతుంది. వ్యవస్థకు, వ్యక్తి’గతానికి ముడిబెడితే ఫలితం ఇలానే ఉంటుందని చరిత్ర చెప్పిన సత్యాన్ని భవిష్యత్తులో మరెవరూ మరువకూడదు. తప్పుటడుగులు వేయకూడదు. 

 

అది చేసాం, ఇది చేసాం అని చెప్పుకోవాల్సింది మనం కాదు. ప్రజలు వేన్నోళ్ళ పొగడాలి. మన అతితెలివి జనానికి తెలియదనుకోవడం ఎంత పొరబాటో ఇప్పటికయినా “అర్థమయ్యిందా రాజా!”. విలాసాలు మనకి, మన అనుయాయులకు, ప్రజలకు మాత్రం చెత్తపన్ను నుండి మెుదలెట్టి ప్రతి పైసా మన జల్సాలకు వాడుకోవడం సబబేనా మరి? తమరు చేసిన అభివృద్ధి, రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళిన పనితనం, ప్రతి ప్రాజెక్టును మీరు చెప్పిన సమయంలో పూర్తి చేసి మాట నిలబెట్టుకున్న తీరు, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో ఎంత విలువైన స్థానంలో నిలబెట్టాయో మీకూ తెలుసు కదా. మీ పరిపాలన ఎంత సవ్యంగా జరిగిందో అందరికి తెలుసు. 

 

ఇంకా చదవండి: రజనీకాంత్ ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయి కి దిగజారి పోయావు! వైరల్ అవుతున్న ట్వీట్!

 

ఆర్థిక నేరగాడికి ఇచ్చిన ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ను ఎంత అధఃపాతాళానికి నెట్టిందో పోలవరాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ ఐదేళ్ళలో కనీసం రోడ్ల గుంటలు పూడ్చడానికి కూడా ఎన్నికల ప్రచారానికి మీ రాక కోసం ఏదో మమ అనిపించారు తప్పించి ఏమైనా చేసారా? పారదర్శక పాలన, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అన్నారు కాని అవినీతి సహిత ఆంధ్రప్రదేశ్ ని చేసారు. ఒక కులం గురించి ప్రజావేదికల మీద బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు. కులం అన్నది మనకు జన్మతః వస్తుంది అన్న విషయం మీకు తెలియదా! ఎందుకు మీకు ఆ కులం మీద అంత కక్ష? ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీ అహంకారంతో అధికారాన్ని దుర్వినియోగం చేసారు. 

 

మీకు మనసనేది ఉంటే నిజాయితీగా మీ మనస్సాక్షిని అడిగిచూడండి, మీరెందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారో! ఇప్పటికయినా మారండి. లేదా మీకు బాగా తెలిసిన మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. అంతేకానీ చాతకాని వాటిల్లో తలదూర్చి మీ పరువుతో పాటుగా మా పరువు కూడా తీయకండి. ముందు మిమ్మల్ని గెలిపించిన పులివెందుల ప్రజలకు ఎం ఎల్ ఏ గా న్యాయం చేసి అనుభవాన్ని సంపాదించుకోండి. లేదూ “నేనింతే” అంటారా సరే మీ ఇష్టాన్ని మేమెందుకు కాదనాలి. కర్మ ఫలితాన్ని అనుభవించడమే. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

“ ముఖ్యమంత్రి నుండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓ సాధారణ ఎం ఎల్ ఏ” గా మారిన మీ రాజకీయ చరిత్ర ప్రతి ఒక్కరికి గుణపాఠంగా చరిత్రలో మిగిలిపోతుంది ఎప్పటికి. ఇది మీ చేతులారా మీరు రాసుకున్న రాత. మన వ్యక్తిగత కక్షలకు ప్రజా జీవితాలను బలి చేయాలనుకునే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఈ ఎన్నికల ఫలితాలు ఓ హెచ్చరిక. 

 

చివరిగా ఓ మాట పప్పు ఆరోగ్యానికి మంచిది. గన్నేరుపప్పు జీవితాలకు హానికరం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఓ మనిషి ఎలా బతకాలో, బతకకూడదో చాలా వివరంగా తెలిపారు మీరు, మీ అనుయాయులు. అందుకు మాత్రం ఈ విషయంలో మీకు మీ భజన గణాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

ఇవి కూడా చదవండి 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే! 

 

గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో! 

 

మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు! 

 

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం! 

 

వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్! అలా చేస్తే కఠిన చర్యలు! 

 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించే ప్రయత్నం! కేంద్ర మంత్రి తో పురందేశ్వరి చర్చలు! 

 

మాచర్లకు పట్టిన పీడ వదిలింది! గుండా సన్నాసి పిన్నెల్లి అరెస్ట్! కఠినంగా శిక్షించాలి 

 

కేసు పెట్టిందే కాక వైసీపీ చెంచాలతో బెదిరింపు కాల్స్! వైరల్ ట్వీట్! 

                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #TDP #YCP #CMCBN #ExCMJagan #CBNAgain #YSJagan #NCBN