చట్టసభల్లో హాజరుకాని నాయకులను ఎన్నికల్లో పోటీ కాకుండా నిషేధించాలి! ముఖ్యంగా ఆంధ్రను సర్వనాశనం చేసిన దేశ ద్రోహి జగన్ను! ప్రజల సొమ్ము ఇష్టారాజ్యంగా ఖర్చు!
Sun Jun 30, 2024 16:11 PoliticsArticle: మంజు యనమదల
మారాలి..!!
ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలకు, లోక్ సభలకు వెరసి చట్టసభలకు గైర్హాజరు కావడం సబబేనా? వీరికి కూడా హాజరు శాతం లెక్క వేయాలి. సరిపడా హాజరు లేని నాయకులు తరువాత ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి. ప్రజల సొమ్ముతో కట్టిన చట్టసభల్లోనికి ప్రజలకు ప్రవేశం ఉండదు. కనీసం వారు ఎన్నుకున్న నాయకులైనా సక్రమంగా సభలకు వెళ్ళాలి కదా.
సభలకు వెళ్ళనప్పుడు వారిని ఎన్నుకోవడంలో అర్థమేముంది? ప్రజల సమస్యలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? గెలిచిన నాయకులు వారి వారి అభివృద్ధి, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి రాబట్టుకోవడంలో చూపే నిబద్దత, తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలు తీర్చడంలో చూపకపోవడానికి కారణాలేంటి? అధికారం వచ్చింది కదాని ప్రజల సొమ్ముని తమ సొంత అవసరాలకు వాడుకునే నాయకులకు శిక్షలేమి ఉండవా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడాన్ని అరికట్టే చట్టాలు లేవా! ఐదేళ్ళ పాలనలో రాబడి, పోబడి లెక్కలు అప్పజెప్పాల్సిన అవసరం లేదా! ఎంత అధికారంలో ఉంటే మాత్రం మన సొంత తిరుగుళ్ళకి కూడా ప్రజల సొమ్ము వాడుకోవడంలో జవాబుదారీతనం ఎక్కడుంది? మన నాయకులకు రాజ్యాంగం, చట్టంలో లొసుగులను ఎలా వాడుకోవాలో తెలిసినంత బాగా, తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడంలో లేదు.
ఏ నాయకుడైనా భవిష్యత్ తరాల పురోభివృద్ధికి బాటలు వేయాలి కాని, కులమత, ప్రాంతీయ, వ్యక్తిగత కక్షలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే, ప్రజల్లో తిరుగుబాటు ఎలా ఉంటుందో అందరు బాగా చూసారు. ఇది గుర్తుంచుకుని అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించిన నాయకుడు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి, చరిత్రలో తనకంటూ ఓ పేజీని పదిలపర్చుకుంటాడు. చరిత్రహీనుడు ఏమౌతాడన్నది మనకు తెలిసినదే కదా..!!
ఇవి కూడా చదవండి:
మోదీ సర్కార్ కు షాక్ ఇచ్చిన నితీశ్ కుమార్! హోదా కావాలంటూ తీర్మానం!
నీట్ పై దద్దరిల్లిన పార్లమెంటు సభలు! ముఖ్య అంశాలు ఇవే!
థాంక్యూ సర్ అన్నందుకు విమానం నుంచి దించేశారు! అసలు కారణం ఏంటో తెలుసా!
ఇదెక్కడి సైకోఇజం రా బాబు! పాటలు వింటే ఉరితీస్తారా! పూర్తి కథ ఏంటో చూసేయండి!
ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!
గ్రీన్ సిగ్నల్ కోసం ట్రాఫిక్ లో ఎదురుచూస్తున్న ఆవు! వైరల్ అవుతున్న వీడియో!
మాల్దీవుల అధ్యక్షుడికి వ్యతిరేకంగా క్షుద్రపూజలు! ఇద్దరు మంత్రుల అరెస్టు!
మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్! ఇండియా కూటమి కీలక నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Politics #TDP #YCP #Jagan #CBN #YSJagan #AndhraPradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.