బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

Header Banner

బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! కొత్త ట్రాఫిక్ రూల్స్! భారీ ఫైన్ - జైలుకు పోయే పరిస్థితి!

  Sun Aug 11, 2024 07:40        Politics

కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అందువల్ల వాహనదారులు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. జేబుకు చిల్లులు పడతాయి. అంతేకాదండోయ్ లైసెన్స్ కూడా కోల్పోవలసి రావొచ్చు. అసలు ఇంతకీ ఈ కొత్త రూల్స్ ఏంటివి అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాను. ట్రాఫిక్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉండొచ్చు. రోడ్డ ప్రమాదాల నివారణే ఇందుకు ప్రధాన కారణం. ఎన్ని రూల్స్ తెచ్చిన ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు సెప్టెంబరు 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్‌ హరేంధిర ప్రసాద్, నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ తాజాగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అంతేకాకుండా బి.ఐ.ఎస్‌. మార్కు కలిగిన హెల్మెట్ను మాత్రమే ధరించాలని సూచించారు.

 

ఇంకా చదవండి: వాలంటీర్లకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం - ఉద్యోగం పై క్లారిటీ! వారికి త్వరలోనే రూ.10 వేలు జీతం!

 

దీనిని అతిక్రమించిన వారికి జరిమానా వేయటంతో పాటు లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్‌ చేయటం జరుగుతుందన్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి రూ.1035 చలానా విధించటం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని నగరవాసులు గమనించాలని కోరారు. అందువల్ల మీరు టూవీలర్‌పై వెళ్లేటప్పుడు ఈ కొత్త రూల్ ఉందని గుర్తు పెట్టుకోండి. లేదంటే మాత్రం జేబుకు చిల్లులు పడతాయి. ఈ కొత్త రూల్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. అలవాటులో పొరపాటుగా వెలితే మాత్రం డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవడం ఉత్తమం. కాగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో బైక్ లేదా స్కూటర్‌పై వెళ్లే వారు ఇద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ అమలులో ఉంది. అందువల్ల మీరు కూడా ఇలా వెళ్లేటప్పుడు రెండు హెల్మెట్స్ ఉండేలా చూసుకోండి. కాగా బెంగళూరు వంటి మహా నగరాల్లో చాలా కాలం నుంచే ఈ రూల్ అమలులో ఉంది. ఇప్పుడు విశాఖలో కూడా ఈ కొత్త నిబంధన అమలులోకి రాబోతోంది. బైక్, స్కూటర్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

 

ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

 

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

 

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples #Traffic #NewRules #Telangana