ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

Header Banner

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త! ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఖరారు! ఇప్పటికే చాలా జిల్లాల్లో..

  Sun Aug 11, 2024 07:00        Politics

ఏపీలో మహిళలకు చంద్రన్న ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఎప్పటి నుంచో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా కల్పిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రెండు రాష్ట్రాల్లో అమలు అవుతున్న మాదిరిగా ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. వీటిపై సంబంధిత అధికారులు ఇప్పటికే నివేదికలను తయారు చేసి సీఎం చేతికి అందించారు. వాటిపై రివ్యూ నిర్వహించిన ప్రభుత్వం దీని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే క్రమంలో ఇటీవల సీఎం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో రవాణా శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగిచుకుంటారని తెలిపారు. దీని అమలుకు సంబంధించి.. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ పథకంతో నెలకు రూ.250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎంకు అధికారులు సూచించారు. తాజాగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటిస్తారన్నారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబుకు ఎన్టీఆర్ భవన్‌లో ఉత్సాహభరిత స్వాగతం! పార్టీ బలోపేతం కోసం కీలక వ్యూహాలు!

 

ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో 7 వేలకు పైగా సిబ్బంది కొరత ఉందని.. ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణినికి సంబంధించి అర్హుల్లో.. ఆధార్ కార్డు తప్పని సరి చేయనున్నారు. ఏపీకి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోంది. అన్న క్యాంటిన్ లు, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నారు. తల్లికి వందనం పథకంకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. అధికారికంగా మొత్తం మొదటి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు పలు శాఖలపై వరుసగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతే కాదు.. పలు శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ రెండు పథకాలను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

 

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

 

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples #FreeBus #Chandrababu