రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

Header Banner

రైతులకు గుడ్ న్యూస్! ఈ పథకంలో రిజిస్టర్ అయితే రూ. 6 వేలు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి! ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే!

  Sun Aug 11, 2024 10:00        Politics

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. వాటిలో “ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” అత్యంత ముఖ్యమైనదిగా మారింది. సొంత వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు 2018, డిసెంబర్‌లో దీన్ని లాంచ్ చేశారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 అందిస్తోంది. రైతులు వ్యవసాయ పనులకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్‌ ద్వారా 12.5 కోట్లకు పైగా రైతులు ఏటా రూ.6,000 అందుకుంటున్నారు. భారతదేశంలో చాలా మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పంట నష్టం లేకుండా మంచి దిగుబడి లభిస్తే రైతులు బాగుంటారు. దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ, పల్లె రైతన్నలకు సిటీ రైతులతో సమానంగా అవకాశాలు లభించడం లేదు. పెట్టుబడికి కావాల్సిన డబ్బు కూడా లేక పంటలు పండించలేకపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్య అన్నదాతలను వేధిస్తోంది. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాన్ని మెరుగుపరచడానికి పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా, రైతు బంధు పేర్లతో పెట్టుబడి సహాయాలు అందిస్తుండగా కేంద్రం పీఎం కిసాన్ పేరిట రైతులకు ఆర్థిక సహాయం చేస్తోంది. ఆ డబ్బుతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుక్కొని తమ పంటలను పండించుకోవచ్చు. రైతులకు డబ్బు వచ్చినప్పుడు, వారు ఆ డబ్బుతో వస్తువులు కొనుక్కొంటారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్పెండింగ్ బూస్ట్ అవుతుంది.

 

ఇంకా చదవండి: ఉచిత బుకింగ్ ఎలా చేయాలో మీకు సులభమైన దశలు! ప్రజలకు గోదావరి ఇసుక అందుబాటులోకి!

 

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..

PM కిసాన్ అఫీషియల్ వెబ్‌సైట్‌ను ద్వారా అర్హులైన భారత రైతుల ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి, ఫార్మర్స్ కార్నర్ విభాగంలోని “న్యూ ఫార్మర్ రిజిస్టర్” లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతులకు సహాయం చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం చాలా బాగా పని చేసింది. అందుకే, కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో మొత్తం దేశానికి వర్తించేలా ప్రధాన మంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. 2018 డిసెంబర్ 1న ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి రూ.75,000 కోట్లు కేటాయించింది. 2020, ఆగస్టు 9న నాటికి ఆరుసార్లు రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పటికే 8.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు అందుకున్నారు.

 

ఎవరు అర్హులు..

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ఎవరు ఈ పథకానికి అర్హులో రాష్ట్ర ప్రభుత్వాలే తెలియజేస్తాయి. ఈ పథకం ప్రకారం, ఒక రైతు కుటుంబంలో భర్త, భార్య, వారి పిల్లలు ఉంటారు. వీళ్లలో ఎవరో ఒకరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రయోజనాలు అందుకోవాలంటే రైతులు ఆధార్ కార్డుతో PM కిసాన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి. ఆధార్ కార్డు లేని వారు వెంటనే దానికి అప్లై చేయాలి.

 

ఇంకా చదవండి: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దువ్వాడ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్! భార్యా, కూతురుపై హత్యాయత్నం ఫిర్యాదు!

 

వైఎస్ జగన్ కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు బంపర్ ఆఫర్! తిరస్కరిస్తే - ఇక ఎమ్మెల్యే సీటు కూడా పోయినట్టేనా?

 

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ 4,109 కోట్ల ప్రాజెక్టు! అందుబాటులోకి ఇలా - వేలల్లో ఉద్యోగాలు!

 

ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా! త్వరలో జరిగేది ఇదే! ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి?

 

కుప్పం, పుంగనూరులో ఆ పనులు చెయ్యండి! ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్!

 

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! ఒక్కొక్కరికి రూ.5 లక్షలు!

 

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

 

జగన్ పై కేసులు పెట్టాలని మంత్రి డిమాండ్! సైకో ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు!

 

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన సీఎం చంద్రబాబు! వైరల్ వీడియో!

 

ఈ సమస్యలు ఉన్నవారు టమాటాలు తినకూడదా! వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

వైసీపీకి ఊహించని షాక్! మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!

 

ఏపీలో ఆగస్టు 15న జెండా ఎగరేసే మంత్రులు వీరే! చంద్రబాబు, పవన్ ఎక్కడంటే?

 

పవన్ విజ్ఞప్తితో ఏపీకి నిధులిచ్చిన మోడీ! అదనంగా రూ.2812.98 కోట్ల - ఇక వారికి పండగే పండగ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples