కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!

Header Banner

కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! దరఖాస్తు ఆ నెలలో ముగియనుంది!

  Wed Aug 21, 2024 07:00        Politics

గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ, కొత్తగా ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ ముందుకు సాగుతోంది కూటమి సర్కార్. ఐతే.. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనే ప్రశ్న ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించింది కానీ కార్డులు జారీ చెయ్యడాన్ని సంవత్సరం కిందటే ఆపేసింది. ఖజానాలో మనీ లేకపోవడంతో.. కొత్త కార్డులు ఇస్తే, లబ్దిదారుల సంఖ్య పెరుగుతుందనీ, తద్వారా ప్రభుత్వంపై సంక్షేమ పథకాల భారం మరింత ఎక్కువ అవుతుందని అంచనా వేసిన జగన్.. ఆ పని చెయ్యకుండా సైలెంటయ్యారు. కొత్త ప్రభుత్వం రాగానే.. కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్ తెరపైకి వచ్చింది. దాంతో.. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. కానీ 2 నెలలైనా.. ఇవ్వకుండా నాన్చుతోంది. ఇంతవరకూ మార్గదర్శకాలే విడుదల కాలేదు. వైసీపీ హయాంలో ఆల్రెడీ చాలా మంది దరఖాస్తులు పెట్టుకున్న వారు.. తమకు కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సమస్య ఏంటంటే.. ప్రభుత్వాలు ఏ పథకం అమలు చేసినా, దానికీ, రేషన్ కార్డుకూ లింక్ పెడుతున్నాయి. దాంతో.. రేషన్ కార్డు లేకపోతే, పథకాలూ లేని పరిస్థితి ఉంటోంది. దాని వల్ల పేదలు, మధ్య తరగతి వారూ ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం కార్డులు ఇస్తుందా లేక మళ్లీ కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలి అంటుందా అనే టెన్షన్ ఆల్రెడీ దరఖాస్తు పెట్టుకున్న వారిలో ఉంది. రేషన్‌ కార్డుల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

 

ఇంకా చదవండి: రాత్రిళ్ళు పెరుగుతున్న మానసిక ఆందోళన! ఎలా బయటపడాలో చెప్తున్న నిపుణులు!

 

 కొత్తగా పెళ్లైన వారికి, పెళ్లైనట్లు సర్టిఫికెట్ చూపిస్తే, వారికి రేషన్ కార్డులు ఇస్తామని తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. కానీ అధికారికంగా జీవో జారీ కాలేదు. ఇదివరకు అప్లై చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం కోడ్‌ నంబరు ఇచ్చింది. వారు ఆ కోడ్ చూపించి, తమకు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ టీడీపీ కూటమి సర్కార్.. దాని ప్రకారం ఇస్తుందో, లేదో చెప్పట్లేదు. వైసీపీ ప్రభుత్వం ఏటా జులై, డిసెంబర్ నెలల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు రేషన్ కార్డులను ఇచ్చింది. ఇప్పుడు జులైలో అలా జరగలేదు. 2023 జులై వరకూ దరఖాస్తులను తీసుకున్నారు. డిసెంబర్‌లో తీసుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ వచ్చి, పని ముందుకు సాగలేదు. కొత్త ప్రభుత్వం ఇంకా దరఖాస్తులను తీసుకోవట్లేదు. పోనీ ఆల్రెడీ ఉన్న కార్డుల్లో మార్పులు చేయించుకుందామా అంటే.. అదీ ఒప్పుకోవట్లేదు. ప్రస్తుతం ఏపీలో దాదాపు 10 లక్షల మంది దాకా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం త్వరలోనే విధివిధానాలు రూపొందించి, కొత్త రేషన్ కార్డులను దసరా లోగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు ఇస్తే, అప్పుడు ఆ కార్డు లబ్దిదారులు.. చాలా ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలవుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుంది. అందువల్ల కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వట్లేదనే విమర్శలున్నాయి. సంపద సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు.. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో ఫలించేలా లేవు. నిన్న శ్రీసిటీ మీటింగ్‌లో కూడా సీఎం చంద్రబాబు.. ఖజానాలో మనీ లేదని డైరెక్టుగా చెప్పారు. అయినా పట్టుదలతో ముందుకెళ్తామని అనడంతో అంతా క్లాప్స్ కొట్టారు. ఇలా ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. అందువల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం వెంటనే ఇవ్వలేకపోతోందని తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మా రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ అంబాజిడర్, ఆయనే మాకు హీరో, మంత్రి భరత్! కరోనా వైరస్ మహమ్మారి తాండవం!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!

 

తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!

 

ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌క‌తా హ‌త్యాచార ఘ‌ట‌న‌పై విజ‌య‌శాంతి ట్వీట్‌!

అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!

 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!

 

ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!

 

18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!

 

విజయ్ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఘోర పరాజయం! టిడిపి ఎంపీ ఏకగ్రీవంగా ఎన్నిక! సెప్టెంబర్ 8న అధికారికంగా!

 

కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!

 

అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?

 

రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance