వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

Header Banner

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

  Wed Aug 28, 2024 21:25        Politics

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంచలన పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు రాజ్యసభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ యాదవ్ వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు బీజేపీలో చేరేందుకు దాదాపుర రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ మోపిదేవి వెంకట రమణ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఎంపీ గొల్ల బాబూరావు సైతం వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చర్చ సాగుతోంది.

 

ఇంకా చదవండిఅది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ! 

 

మోపిదేవి, గొల్ల బాబురావు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరికి ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం రెడీ అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొంతమంది కీలక నేతలు వరుస పెట్టి వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు రావడం, అధికారం కోల్పోవడంతో నేతలు పార్టీలు మారబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలు వైసీపీలో పెనుసంచలనమేనని పలువురు చెబుతున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!

 

కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP