అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా! విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు!

Header Banner

అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా! విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు!

  Fri Aug 30, 2024 19:31        Politics

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూంలో హిడెన్ కెమెరా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఇంజనీరింగ్ కాలేజికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. విద్యార్థినుల ఆవేదన, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వేగంగా విచారణ జరపాలని తెలిపారు. సీక్రెట్ కెమెరాల ద్వారా చిత్రీకరణ జరిగిన విషయం నిర్ధారణ అయితే, అందుకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మన ఇంట్లో ఆడబిడ్డలకు వచ్చిన కష్టం అని భావించి, నిజాలు నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ మున్సిపల్ విభాగంలో ఊహించని మార్పులు! 27 మంది కమిషనర్లకు ఆకస్మిక బదిలీలు!

 

తద్వారా ఆందోళనలో ఉన్న విద్యార్థినుల్లో ఒక భరోసా కల్పించాలని అన్నారు. ఇక, విద్యార్థినుల ఫిర్యాదును కాలేజి యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలపైనా విచారణ జరపాలని ఆదేశించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. విద్యార్థినుల వద్ద ఆధారాలు ఉంటే నేరుగా నాకు పంపండి అని చంద్రబాబు సూచించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రతి మూడు గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. కాగా, ఈ వ్యవహారంలో దర్యాప్తు కోసం కృష్ణా జిల్లా పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి గుడివాడ క్రైమ్ విభాగం సీఐ రమణమ్మ నేతృత్వం వహిస్తారని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ప్రకటించారు. ఈ బృందంలో ఐదుగురు సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. ఈ స్పెషల్ టీమ్ గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజిని సందర్శించి దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. హిడెన్ కెమెరా ఆరోపణల నేపథ్యంలో, తాము నాన్ లినేయర్ జంక్షన్ డిటెక్టర్ (ఎన్ఎల్ జేడీ)ని ఉపయోగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. త్వరలోనే ఈ కేసును పరిష్కరిస్తామని చెప్పారు.

 

ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu