జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

Header Banner

జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్! నేరుగా నదిలోకి వెళ్లి? ఇంత జరిగినా కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు!

  Sat Aug 31, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్ అయ్యారు. అక్రమంగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా మీరేం చేస్తున్నారు అంటూ ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిలదీశారు. స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగడంతో కడప జిల్లా పోలీసులు ఉలిక్కిపడ్డారు. కడప జిల్లాలోని వేంపల్లిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కొందరు సమాచారం ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆయా పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేంపల్లిలోనే కుమ్మ రాంపల్లి, గవి మల్లేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నారని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కొందరు ఫిర్యాదు చేశారు. గవి మల్లేశ్వర స్వామి ఆలయం సమీపం నుండి పాపాఘ్ని నది సమీపంలోకి ట్రాక్టర్లతో వెళ్లి ఇసుకను తవ్వేస్తున్నారని, రాత్రిపూట ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

 

ఇంకా చదవండి: అమ్మాయిల వాష్ రూంలో సీక్రెట్ కెమెరా! విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు!

 

విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎస్పీ వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఫోన్ చేసి వివరాలు అడిగారని తెలిసింది. ఒక్కసారిగా జిల్లా ఎస్పీ ఫోన్ చేయడంతో హడలిపోయిన వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి పాపాఘ్ని నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా జేసీబీలతో పెద్ద పెద్ద గోతులతో తవ్వించారు. అర్ధరాత్రి నుండి ఉదయం వరకు లెక్కలేనన్ని ట్రాక్టర్లు తీసుకువచ్చి పాపాఘ్ని నది పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వేసి ఇష్టం వచ్చినట్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని వదిలేస్తున్నారని స్థానికుల ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఇసుక వ్యాపారం చేస్తున్నవారు వైసీపీ మద్దతు దారులని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు ఆరోపించారు. పాపాఘ్ని నది పరిసర ప్రాంతాల్లోని ఇసుకకు భారీ డిమాండ్ ఉండడంతో ఆ వ్యాపారం చేయడానికి కొన్ని నెలల క్రితం సుమారు 25 మంది కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసి అర్ధరాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు స్వచ్చగా ఇసుకను అక్కడినుండి అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ దెబ్బకు హడలిపోయిన పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఒక ట్రాక్టర్ పట్టుకుంటే సరిపోదని, అన్ని ట్రాక్టర్లను ఎలా పట్టుకోవాలని, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా: 24/7 అందుబాటులోకి రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం! సిడ్నీ వాసులకు అన్ని సౌకర్యాలతో అన్ని ప్రాంతాలకి! మొదటి ఎయిర్ వేస్ ఏది అంటే!

 

ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

 

ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!

 

జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?

 

వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!

 

వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

 

అది ఎన్నారైల కోసమేనా? అన్ని దేవదాయ ట్రస్ట్ బోర్డులలో అదనంగా మరో ఇద్దరికి అవకాశం! ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధి కోసం కమిటీ!

 

సైకో ప్రభుత్వం మూసేసిన జీవో అయ్యారు వెబ్సైటు పునరుద్ధరణ! ఇకపై అన్ని జీవోలు ఆ సైట్లో చూసుకోవచ్చు! పారదర్శక పాలనకు చంద్రబాబు పెట్టింది పేరు!

 

విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples