రేషన్, ఆధార్ లేకపోయినా బాధ లేదు! ఉచితంగానే బియ్యం, నూనె, కందిపప్పు! ఎలా అని అనుకుంటున్నారా?

Header Banner

రేషన్, ఆధార్ లేకపోయినా బాధ లేదు! ఉచితంగానే బియ్యం, నూనె, కందిపప్పు! ఎలా అని అనుకుంటున్నారా?

  Fri Sep 06, 2024 07:00        Politics

సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం అందించే సహాయంపై ఆంక్షలను తొలగించింది. రేషన్ కార్డులతో ముడిపెట్టకుండా రేషన్ సరుకు ఇస్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా నిత్యవసర సరకులు అందజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కొనసాగింపుగానే భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈవిషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఈనిత్యవసర సరుకుల పంపిణికి రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇస్తామని తెలిపారు. అయితే ఈ పాస్ మిషన్ ద్వారా ముంపు ప్రాంతాల్లోని 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే వరద బాధితులకు అంటే సుమారు 2లక్షల మందికిపైగా నిత్యవసర సరుకులు పంపిణి చేస్తామని వెల్లడించారు. 

 

 ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు! బెంగుళూరులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ!

 

అయితే రేషన్ కార్డులు లేని వారు ఆధార్ కార్డు లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ నిత్యవసర సరుకులు అందజేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నారు. ఈ కిట్‌లలో 25 కిలోల బియ్యంలీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 1 Kg కందిపప్పు, 2 Kg ఉల్లిగడ్డలుకిలో చెక్కర ఉంటుంది. తొలి విడతగా 50 వేల కుటుంబాలకు ఈ సాయం అందించబోతోంది కూటమి ప్రభుత్వం. మొత్తంగా లక్షల 50 వేల నిత్యావసరాల కిట్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సహాయక చర్యలు వేగవంతం చేసిన ఏపీ సర్కార్.. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. అదేవిధంగా మొబైల్‌ మార్కెట్ల ద్వారా కూరగాయలను వరద బాధితులకు అందించాలని.. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు రూ.2 నుంచి రూ.20 లోపు ధర ఫిక్స్ చేశారు. అన్ని కూరగాయలను రూ.5గా అదేవిధంగా రూ.20పైన ఉండే కూరగాయలను రూ.10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలపై సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం.. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వర్షాల కారణంగా అతలాకుతలమవుతున్న జిల్లాలకు సహాయ చర్యలకు గాను ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు, తీవ్రత తక్కువున్న జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున తక్షణసాయం విడుదల చేశారు. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రజల రక్షణ కోసం అధికారులంతా కనిపై కునుకు లేకుండా పని చేయాలని అన్నారు.

 

ఇంకా చదవండి: ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #Chandrababu #Rationcard