జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

Header Banner

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

  Sun Sep 08, 2024 07:59        Politics

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఇళ్లు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు జగ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధానంగా బుడమేరు వరద నీరు విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార యంత్రాంగం, ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడకు వరద ముంచెత్తిననాటి నుండి సీఎం చంద్రబాబు ..ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే తన తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అధికార యంత్రాంగంతో వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ .. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సాయం అందడం లేదని జగన్ ఆరోపిస్తూ, అసలు ఇందతా ఎందుకు జరిగిందో చెబుతూ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. 

ఇంకా చదవండి: మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!


దీనిపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సాయం మీకు కనిపించడం లేదా అంటూ కూటమి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు మీరు చేసిన నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, రాజకీయంగా ఆడే ఆట కాదు, ఇది ప్రజల జీవితం, సోషల్ మీడియాలో విమర్శలు మాని, ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం చేయండి అంటూ కామెంట్స్ పెట్టారు. మరో పక్క జగన్ ట్వీట్ పై సినీ నటుడు బ్రాహ్మాజీ స్పందిస్తూ తనదైన శైలిలో ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు. ‘మీరు కరెక్టు సార్.. వాళ్లు చేయ్యలేరు..ఇక నుండి మనం చేద్దాం.. ఫస్ట్ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైసీపీ కేడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం.. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్ అన్నా’ అంటూ బ్రహ్మాజీ పోస్టు పెట్టారు. మరోవైపు వరద ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శనివారం కూడా అందరికీ ఆహారం, మంచినీరు అందించామన్నారు. బాధితులకు ఇంటింటికీ వెళ్లి సరకుల కిట్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని కోరారు. రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78శాతం శుభ్రం చేశామని, మొత్తం 1.40లక్షల ఇళ్లలో సామగ్రి పాడైందన్నారు. ఉపాధి కల్పించాలని చాలా మంది కోరుతున్నారన్న చంద్రబాబు... కొన్ని కంపెనీలతో మాట్లాడి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 

ఇంకా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

బుడమేరుకు పెరుగుతున్న వరద! విజయవాడ వీధుల్లోకి నీళ్లు!

 

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం! టీడీపీ నుండి ఎమ్మెల్యే సస్పెన్షన్!

 

ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు బిగ్ షాక్! చుక్కలు చూపించిన అధికారులు!

 

ఏలూరులో వైసీపీకి మరో బిగ్ షాక్! పార్టీకి సీనియర్ నేత గుడ్ బై!

 

వరద ప్రవాహం తగ్గడంతో... కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజి మరమ్మత్తుల పనులు!

 

వైసీపీ కి షాక్.. వైసీపీ మాజీ ఎంపీ అరెస్ట్‌! ఎందుకో తెలుసా?

 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేదు అనుభవం! దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన వరద బాధితులు! ఎందుకంటే..!

 

ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!

 

ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!

 

గొప్ప మనసు చాటుకున్న భువనేశ్వరి! తెలుగు రాష్ట్రాల‌కు రూ.2కోట్ల విరాళం ప్ర‌క‌టించిన!

 

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మెంటో చెప్పిన డిప్యూటీ సీఎం!

 

ఏపీలో ప్రకృతి ప్రకోపం.. వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ!

 

తెలుగు రాష్ట్రాలకు భారీ వరద సాయం ప్రకటించిన హీరో మహేశ్ బాబు! ఎంతో తెలుసా?

 

ప్రియురాలిని క‌ల‌వ‌డానికి బురఖాలో వెళ్లిన యువ‌కుడు.. చివ‌రికి జ‌రిగింది ఇదీ! సోషల్ మీడియాలో వైరల్!

 

నారా లోకేశ్ కు చంద్రబాబు కీలక ఆదేశాలు! 36 వార్డుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా!

 

విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద! ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం!

 

ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ ఉదార‌త‌.. భారీ విరాళాలు ప్ర‌క‌టించిన స్టార్స్‌! ఎంతో తెలుసా?

 

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు తెలుగువారు స‌హా న‌లుగురు భార‌తీయులు మృతి!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YSRCP #YSJagan #ActorBrahmaji #Floods