తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

Header Banner

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

  Tue Sep 10, 2024 07:00        Politics

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే ప్రకటన చేశారు. న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో తాజాగా జరిగిన 54వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. జీఎస్‌టీ మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా క్యాన్సర్ డ్రగ్స్‌పై జీఎస్‌టీ రేటును భారీగా తగ్గించేసింది. ఇది వరకు ఈ రేటు 12 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని 5 శాతానికి తగ్గించేశారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స భారం కొంత మేర తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జీఎస్‌టీ కౌన్సిల్ మరో గుడ్ న్యూస్ కూడా తెచ్చింది. నమ్‌కిన్‌పై జీఎస్‌టీ రేటు తగ్గించేశారు. ఇది వరకు వీటిపై 18 శాతం జీఎస్‌టీ రేటు ఉండేది. అయితే దీన్ని 12 శాతానికి తగ్గించేశారు. ఇది సానుకూల అంశం. అంతేకాకుండా హెలికాప్టర్ సర్వీసులపై కూడా జీఎస్‌టీ దిగి వచ్చింది. జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా ఈ సేవలపై జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించింది. దీని వల్ల దేశంలో హెలికాప్టర్ సర్వీసులు ఊపందుకునే అవకాశం ఉంటుంది. అలాగే జీఎస్‌టీ కౌన్సిల్ ఎంపిక చేసిన స్నాక్స్‌పై జీఎస్‌టీ రేటులో కోత విధించింది. ఈ జీఎస్‌టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించేసింది. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలు, కేంద్రం ఏర్పాటు చేసే విద్యా సంస్థలకు వచ్చే ఫండ్స్‌పై జీఎస్‌టీ ఉండదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే కారు సీట్లపై మాత్రం జీఎస్‌టీని పెంచేశారు. ఇది వరకు ఇది 18 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని 28 శాతానికి పెంచేశారు.

 

ఇంకా చదవండి: ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కాలరాత్రి సరిగ్గా నేటికీ సంవత్సరం! అన్యాయంగా అక్రమంగా దుష్టుడు చేసిన రాక్షస క్రీడ!

 

అలాగే సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకురావాలనే అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈవీ చార్జింగ్ స్టేషన్లపై ట్యాక్స్ అంశాన్ని పునపరిశీలిస్తామని జీఎస్‌టీ కౌన్సిల్ పేర్కొంటోంది. ఆన్‌లైన్ పేమెంట్లకు సంబంధించి పేమెంట్ అగ్రిగేటర్ల పన్ను చెల్లింపు అంశం చర్చకు రాలేదని కౌన్సిల్ వెల్లడించింది. కన్సూమర్ల కోసం బీ2సీ ఇ-ఇన్వాయిసింగ్ సేవలను తీసుకువచ్చేందుకు కౌన్సిల్ అంగీకారం తెలిపింది. అయితే ఈ సేవలు స్వచ్ఛందంగా ఉంటాయని తెలిపింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అమలు చేస్తామని పేర్కొంది. ఐజీఎస్‌టీని ఎలా ముందుకు తీసువెళ్లాలనే అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమర్షియల్ ప్రాపర్టీలను అద్దెకు తీసుకునే అంశాన్ని రివర్స్ చార్జ్ మెకానిజం కిందకు తీసుకువస్తామని కౌన్సిల్ వెల్లడించింది. హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఒక జీఓఎం ఏర్పాటు చేస్తామని, అక్టోబర్ చివరకు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ నివేదిక అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. నవంబర్ మీటింగ్‌లో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే క్యాసినో, ఆన్‌లైన్ గేమింగ్ వంటి అంశాలపై కూడా జీఎస్‌టీ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించింది. అందువల్ల వచ్చే మీటింగ్‌లో ఈ అంశాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనుంది.

 

ఇంకా చదవండి: అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!

 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!

 

ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!

 

జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!

 

మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!

 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!

 

వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొన‌సాగుతున్న వైసీపీ నేత‌ల రాజీనామాల ప‌ర్వం! కారణం?

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!

 

టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!

 

భార్య పేరు మీద ఇల్లు కొంటే ఇన్ని లాభాలా? భారీ మొత్తంలో డబ్బు మిగలడం ఖాయం! ఇక ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!

 

ఒమాన్: కేవలం 5 రియాల్ (₹1,000) కే 10 రోజుల టూరిస్ట్ వీసా! అతి తక్కువ విమాన మరియు హోటల్ ధరలు! భారతీయులకు ఒమాన్ ప్రభుత్వం భారీ ఆఫర్లు!

 

ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!

 

స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!

 

హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu