ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

Header Banner

ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్‌ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్‌!

  Sun Sep 15, 2024 11:54        Politics

ఇటువంటి అసమర్థ వ్యక్తి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రభుత్వపరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని, ఎన్‌ఎంసీ ఇస్తామన్న ఎంబీబీఎస్‌ సీట్లు వద్దన్న సత్యకుమార్‌ లాంటి ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడైనా ఉంటారా? అని వైసీపీ విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

 

ఇంకా చదవండికొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇప్పటికీ పూర్తిగా నిర్మాణం అయ్యింది ఒక్కటి లేదని.. సగం పైగా పునాదుల దశలోనే ఉన్నాయని చెప్పారు. కాలేజీ హాస్టల్ భవనాలు పూర్తి చేయకుండానే గత సంవత్సరమే ఆర్భాటంగా రాజమండ్రి వైద్య కళాశాల ప్రారంభించారని.. ఈ ఏడాది రెండో సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక భవనాలలోనే తరగతులు నడపాల్సిన దుస్థితి ఉందని వివరించారు. 

 

ఇంకా చదవండిమోదీ పుట్టినరోజు నాడు అజ్మీర్ దర్గా ఆధ్వర్యంలో 4 వేల కిలోల శాకాహారం పంపిణీ కార్యక్రమం! ఎక్కడో తెలుసా? 

 

మెడికల్ కౌన్సిల్ జూలై నెలలోనే అనుమతి నిరాకరించిన విషయం మీకుతెలియదా అని మంత్రి సత్యకుమార్‌ ప్రశ్నించారు. అవన్నీ ఎందుకు సొంత నియోజకవర్గం పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదని నిలదీశారు. 48% బోధనా సిబ్బంది లేరన్న విషయం మరిచారా అని అడిగారు. అనుమతి తీసుకుని విద్యార్థులను ఎక్కడ చదివించాలి సారూ? చెట్ల కింద? అమ్మాయిలను ఎక్కడ ఉంచాలి సారూ? షెడ్ల కింద? పోనీ సర్దుకుందాం. మరి పాఠాలు ఎవరు చెప్పాలి? మీరు చెప్తారా ప్రొఫెసర్ జగన్? అని ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకోవాలనుకున్నారని మండిపడ్డారు. ఇటువంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే ప్రజలు మీకు 151 నుండి 11 కు దించారు. అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా అని విమర్శించారు. జగన్ గారూ, ఇప్పటికైనా మారండి. ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి.. లేదంటే ప్రజలు బెంగుళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారని అన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

జగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు?

 

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపేపండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP