వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!
Tue Sep 17, 2024 16:38 Politicsఏపీకి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం త్వరలో ప్రైవేటీకరించనుందన్న వార్తలు కార్మికులు, ఉద్యోగుల్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వారు విధులు బహిష్కరించి రోడ్లపైకి వస్తున్నారు. ప్లాంట్ పనిచేసేందుకు అవసరమైన ముడి సరుకు కొరత తీవ్రమవుతుండటం, మరోవైపు ఉద్యోగులను ప్రొబేషన్ పై ఇతర సంస్థలకు పంపడం చూస్తుంటే ప్రైవేటీకరణ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇవాళ రాజమండ్రిలో స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ధ్వంసం చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదని ఆమె తేల్చిచెప్పారు.
ఇంకా చదవండి: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!
స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనే ఆలోచనే కానీ, లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనే కానీ, ధ్వంసం చేసే ఆలోచన కేంద్రానికి లేదన్నారు. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్లాంట్ కు వచ్చి పరిశీలించి సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదన్న హామీ మాత్రం పురందేశ్వరి ఇవ్వలేదు. కేవలం స్టీల్ ప్లాంట్ కాపాడి, లాభాల్లోకి తెస్తామని మాత్రమే చెప్పారు. గతంలో కేంద్రం కూడా పలుమార్లు ఇదే విషయం చెప్పింది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం ద్వారా అది పూర్తిగా మునిగిపోకుండా చూస్తామని మాత్రమే కేంద్రం గతంలో పార్లమెంట్ లోనూ వెల్లడించింది. దీంతో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏం చేయాలనే దానిపై కూటమి పార్టీల్లోనూ టెన్షన్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అంగన్‌వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!
ప్రయాణికులకు ఆర్‌టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్‌లు! బస్టాండ్‌లో ఉదయం 6 గంటలకు!
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!
ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!
ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...
ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్!
ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!
కొత్త పెన్షన్లపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం! దరఖాస్తులు ఎప్పటి నుంచంటే? Don't Miss!
జగన్ ఐదేళ్ల పాలన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు! అర్థంలేని విమర్శలతో కాలక్షేపం చేస్తున్న వైసీపీ!
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మరోసారి పొడిగింపు! ఎలా చేయాలో చూసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.