గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

Header Banner

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

  Thu Oct 03, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. సంక్రాంతి నుంచి కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. ఆరోజు పీ4 కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలకు త్వరలోనే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ హోదా కల్పించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యక్తి గత రుణాలను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్వాకాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామతీర్థంలో రాముడి తల తీసేస్తే ఎన్నికలు జరిగేవరకు దర్యాప్తు చేయలేదని, మూడు సింహాలను దొంగిలించినా స్పందన లేదన్నారు. అనంతపురంలో దేవుడి రథం తగలబెట్టి తెలుగుదేశం పార్టీమీద నెపం నెట్టారన్నారు.

 

ఇంకా చదవండి: పోర్టుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి మహా ప్రణాళిక! పనుల వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం!

 

నేరస్తుల ఆటలు సాగనివ్వనని, ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకుంటామన్నారు. నేరస్తులు, రౌడీషీటర్ల భరతం పడతామని హెచ్చరించారు. 2027 నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అందిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం పథకం జల్ జీవన్ మిషన్ ను ఉపయోగించుకుంటామన్నారు. బుడమేరు విజయవాడను ముంచేసినప్పుడు వరదలవల్ల వ్యాధులు రాకుండా అడ్డుకోగలిగామన్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి రూ.450 కోట్ల విరాళాలు వచ్చాయని, తాను చేసిన పనికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటికీ వచ్చి చెత్తను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాను ఏమైనా చెబుతుందే చంద్రబాబు ఇలాగే చెబుతుంటాడులే అనుకుంటారని, తమకు ఓ పది రూపాయలు డబ్బులిస్తే చాలులే అనుకుంటున్నారని, కానీ తన ఆలోచనల్లా రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలబెట్టడమేనని స్పష్టం చేశారు.


ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు!

 

ఆంధ్రాలో అమెరికా వీసా అప్లికేషన్ కౌన్సిలేట్ సెంటర్! స్టూడెంట్స్, వ్యాపారస్తులకు తొలగనున్న ఇబ్బందులు! ఎప్పుడు మొదలవుతుంది అంటే!

 

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో రాష్ట్ర మంత్రి భేటీ! పలు అంశాలపై చర్చ!

 

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త! రికార్డు స్థాయిలో వీసా అపాయింట్మెంట్లు జారీకి ఆమోదం! స్టూడెంట్స్, వ్యాపారస్తులు, తల్లిదండ్రులు ఫుల్ ఖుషి!

 

దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం! అసలు జరిగింది అంటే!

 

మందు బాబులకు షాక్.. రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్! ఈ ఏడాది ఓనం మద్యం విక్రయాలు!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. ఇలా చేస్తే, 3 ఉచిత సిలిండర్లు రావు! ఆయా జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు!

 

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance