తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

Header Banner

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

  Thu Oct 03, 2024 13:48        Politics

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి తిరుమలకు పవన్‌ కల్యాణ్‌ కాలినడనక చేరుకున్నారు. అయితే మార్గమధ్యలోనే ఆయనకు వెన్ను నొప్పి రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ శ్రీవారిని మనసులోనే తలచుకుంటూ పట్టుదలతో ఏడుకొండలు ఎక్కారు. బుధవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అయితే.. కొండ ఎక్కే సమయంలో వచ్చిన వెన్ను నొప్పితో పవన్‌ కల్యాణ్‌ తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

తిరుమలలో బస చేసిన అతిథి గృహంలోనే ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే ఆయనకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌.. నిన్న శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించారు.ఈ పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్‌ సభ నిర్వహించాల్సి ఉంది. ఈ సభలో పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు? సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఎలాంటి పోరాటానికి సిద్ధమవుతారో తెలుసుకోవాలని ఏపీ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!  

 

ఇలాంటి సమయంలో పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వారాహి డిక్లరేషన్‌ సభ ఉంటుందా? లేదా అనే సందిగ్ధత మొదలైంది. అయితే ఎంతటి జ్వరం ఉన్నా సరే పవన్‌ కల్యాణ్‌ వారాహి సభకు హాజరవుతారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP