డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

Header Banner

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

  Fri Oct 04, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మార్క్ పాలన చేస్తూ వేగంగా అడుగులేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పలు కీలక పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘాలకు మేలు చేసేలా ఆలోచనలు చేస్తున్న సీఎం.. డ్వాక్రా సంఘాలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఇకపోతే సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మరో కార్యక్రమాన్ని అఫీషియల్ గా ప్రకటించారు సీఎం. రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P-4 కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు.. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుందని అన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా?

 

అదేవిధంగా డ్వాక్రా మహిళలకు మరింత మేలు కలిగేలా కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని (పీఎంఈజీపీ) దీనికి అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాల కింద వ్యాపారం చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసి.. ఆ రుణంలో 35 శాతం రాయితీ ఇవ్వనున్నారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారికి రూ.35 వేలు రాయితీ కింద మినహాయిస్తారు. అయితే కొన్ని కండీషన్స్ ప్రకారం ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరు? ఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance