హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

Header Banner

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

  Fri Oct 04, 2024 18:33        Politics

తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్వాగతించారు. లడ్డూ అపవిత్రంపై వాస్తవాలు బయటకు రావాలని, అందుకే ఐదుగురితో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో హిందువుల ఆలయాలపై యథేచ్చగా దాడులు జరిగాయని గుర్తించారు. రథాన్ని తగలబెట్టినా, రాముడి విగ్రహం ధ్వంసం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం తిరుమలలో నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. శ్రీవారికి దంపతులే పట్టువస్త్రాలు సమర్పించాలని శాస్త్రం, ధర్మం చెబుతోందన్నారు. కానీ శ్రీవారికి వైఎస్ జగన్ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తాము నమ్ముతున్నామని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP