ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

Header Banner

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

  Sun Oct 06, 2024 07:00        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఏ పథకం ప్రవేశపెట్టినా, అలాంటి పథకం ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలవుతోందో ముందుగా పరిశీలన చేస్తోంది. ఈ క్రమంలో ఏపీలో దీపావళి నుంచి ఇస్తామన్న 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లకు సంబంధించిన మహాశక్తి పథకాన్ని ప్రారంభించే ముందు.. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలవుతోందో గమనించింది. ఇది కర్ణాటకలో బాగా అమలవుతున్న పథకం. దాన్ని చూసిన సీఎం చంద్రబాబు, టీడీపీ-జనసేన కూటమి మేనిఫెస్టోలో దీన్ని చేర్చారు. కర్ణాటకలో ఈ పథకం బాగానే అమలవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తోంది. దీన్ని ఉజ్వల పథకం లబ్దిదారులకు అందిస్తోంది. దీన్ని కూడా ఏపీ ప్రభుత్వం గమనించింది. ఐతే.. ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కంటే ముందే.. ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. దీపావళి రాకముందే.. ఈ పథకాన్ని అమలు చెయ్యాలనే ఆలోచనలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీచేశారు. దీపావళి పండుగ అక్టోబర్ 31న కాబట్టి.. పండుగకు 10 రోజులకు ముందే ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్లాన్ చేసుకున్నారు.

 

ఇంకా చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ! ముంబయి నటి మధ్య ఓ పార్టీలో..

 

తద్వారా పండుగ రోజున.. లబ్దిదారుల ఇంట్లో నిండుగా ఉండే గ్యాస్ బండ ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ ప్రకారమే.. అక్కడి అధికారులు జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీలు.. వంటగ్యాస్ సిలిండర్లను రెడీగా తెచ్చి స్టాక్ పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను పరిశీలిస్తోంది. ఏపీలో కూడా దీపావళి పండుగ కంటే ముందే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోందని సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. అక్టోబర్ 20 తర్వాత ఎప్పుడైనా ఈ పథకాన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. అంటే మరో 15 రోజుల తర్వాత ఎనీటైమ్ ఈ స్కీమ్ అమలయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకు లబ్దిదారులు రెడీగా ఉండటం మేలు. అందుకు వారు చెయ్యాల్సిన రెండు పనులు ఉన్నాయి. ఈ పథకాన్ని మహాశక్తి పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు మార్చి 31, 2025లోపు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటోంది. ఐతే.. చాలా మంది లబ్దిదారుల్లో మహిళల పేరుపై గ్యాస్ కనెక్షన్ లేదు. పురుషులు, ఇంటి యజమాని పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంది. అయినప్పటికీ ఉచిత సిలిండర్లు పొందే అవకాశం ఉంటుంది. దీనిపై ఓసారి గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడి కన్ఫామ్ చేసుకోవడం మేలు. మరో పని కూడా ఉంది. లబ్దిదారులు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి.. ఆధార్ బయోమెట్రిక్ కూడా చేయించుకోవాలి. ఎల్పీజీ కనెక్షన్‌కి ఆధార్ లింక్ చేయించుకోవాలి. ఇది 2 నిమిషాల్లో పూర్తయ్యే పని. తద్వారా ఈ పథకం లబ్దిదారుల లిస్టులో మీ పేరు కూడా ఉండగలదు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఏజెన్సీలు లబ్దిదారులను పిలిపించుకొని ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. మీరు ఇంకా ఈ పని చేయించుకోకపోతే, వెంటనే వెళ్లి చేయించుకోండి. త్వరలోనే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత ఎవరు లబ్దిదారులో తెలుస్తుంది. అలా తెలిసేవరకూ ఆగకుండా.. ముందుగా చేయించుకోవాల్సిన ప్రక్రియను, ముందే చేయించుకుంటే, చివరి నిమిషంలో ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో లబ్దిదారులు మహాశక్తి పథకం పొంది తీరాలి. వారికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు వచ్చి తీరాల్సిందే.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance