ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

Header Banner

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

  Sun Oct 06, 2024 08:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ ముగిసింది.. ఆ సీజన్‌లో రైతులు వరిని బాగానే పండించారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల కొంత పంట నష్టం వచ్చినప్పటికీ, మిగతా జిల్లాల్లో పంటలు బాగానే పండించారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనేందుకు గైడ్‌లైన్స్ జారీ చేసింది. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కి 37లక్షల టన్నుల ధాన్యం కొనాలనుకుంటోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల ప్రకారం.. ఇప్పుడు రైతులు తమకు దగ్గర్లో నచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. అందుకు కావాల్సిన రవాణా వాహనాలు, గోనె సంచులను ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌కి అయ్యే లేబర్‌ ఛార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు అధికారులకు అదేశాలిచ్చారు.

 

ఇంకా చదవండి: ఏపీలో ఆ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు! శంకుస్థాపనపై కేంద్ర మంత్రి కీలక అప్‌డేట్!

 

ధాన్యం కొనేటప్పుడు మోసాలు జరగకుండా బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు తీసుకుంటారు. అలాగే ధాన్యాన్ని తరలించే వాహనాలకు GPS ట్రాకింగ్ పరికరాలు అమర్చి.. మిల్లుల దగ్గర ఎప్పటికప్పుడు వాహనాల్ని త్వరగా పంపించేసేలా చేస్తారు. అలాగే వాహనాల సంఖ్యను బట్టీ.. హమాలీలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకు రైతు ప్రభుత్వంగా చెప్పుకున్న వైసీపీ.. రైతుల కొంప ముంచిదనే వాదన ఉంది. ఆ ప్రభుత్వం ర్యాండమైజేషన్ విధానం తెచ్చింది. అందువల్ల రైతులు తమకు నచ్చిన మిల్లుల్లో ధాన్యాన్ని అమ్ముకునే వీలు ఉండేది కాదు. ఈ విధానంతో.. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నేతలకు చెందిన మిల్లుల్లోనే అమ్మేలా చేసేదనీ, దీని వల్ల రైతులు చాలా దూరం బియ్యాన్ని తీసుకెళ్లాల్సి వచ్చేదని ప్రభుత్వానికి తెలిసింది. కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వచ్చేది. అందుకే ప్రభుత్వం ఈ ర్యాండమైజేషన్ విధానాన్ని ఎత్తివేసింది. గత ప్రభుత్వం గోనె సంచులు ఇవ్వలేదనీ, లేబర్, రవాణా ఛార్జీల భారం తమపై పడిందని రైతులు చెప్పడంతో.. కూటమి ప్రభుత్వం ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతోంది. లేబర్ ఛార్జీలు చెల్లిస్తోంది. గోనె సంచులు ఇస్తోంది. రవాణా ఖర్చులు తగ్గిపోయేలా చేసింది. అందువల్ల రైతులు ఇప్పుడు బాగానే అమ్ముకునే వీలు ఉంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తూ... ఎక్కడా తేడా రాకూడదని ఆదేశాలు ఇచ్చారు. రైతులకు మేలు జరిగితే, అందరికీ మేలే.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AmitShah #Dharmavaram #TDP-JanaSena-BJPAlliance