మహిళలకు సున్నా వడ్డీకే రూ.10 లక్షలు.. ప్రభుత్వం శుభవార్త! అది ఎలానో మీకు తెలుసా? ఆ వివరాలు చూడండి!

Header Banner

మహిళలకు సున్నా వడ్డీకే రూ.10 లక్షలు.. ప్రభుత్వం శుభవార్త! అది ఎలానో మీకు తెలుసా? ఆ వివరాలు చూడండి!

  Mon Oct 14, 2024 07:30        Politics

మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం కలిసి మహిళలకు లక్షాధికారులను చేయాలని పక్కా ప్రణాళికలతో వడివడిగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే లఖ్‌పతి దీదీ పథకాన్ని కూడా తీసుకువచ్చాయి. ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1.23 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ మేరకు రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అలాగే ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను సేకరించి జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేశారు. ప్రస్తుతస్వయం ఉపాధి యూనిట్లను మరింత విస్తరించేందుకు రుణాలు కూడా పెంచారు. వీరికి రుణాన్ని రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు మార్చి నెలాఖరులోపు అందించే అవకాశం ఉంటుంది. స్వయం సహాయక సంఘంలో దాదాపు 8 నుంచి 10 మంది వరకు మహిళలు ఉన్నారు. బ్యాంక్‌ లింకేజీ కింద ఒక్కో సంఘానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈవిధంగా తీసుకున్న రుణాల ద్వారా పచ్చళ్లు, అగర బత్తులు, కాగితపు ప్లేట్లు, టీ కప్పులు, ఫినాయిల్, యాసిడ్ వంటి తదితర వాటిని తయారు చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! రేపు ఉదయం విచారణకు రావాలని నోటీసులు!

 

వీటిని మార్కెటింగ్‌ చేస్తూ ఆర్థికాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నారు. అంతేకాకుండా వీరితో పాటుగా ఇంకొంత మందికి ఊపాధి కల్పిస్తున్నారు. అందువల్ల సమాజం కూడా అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ఇదివరకు రూ.3 లక్షల రుణం వరకు సున్నా వడ్డీ పథకం అమలు జరిగింది. కాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గరిష్ఠంగా సంఘానికి రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఎంఎస్‌వై వంటి పథకాల ద్వారా రుణాలపై 35 శాతం రాయితీ వర్తింపజేయనున్నారు. ఇంకా వీటితో సంబంధం లేకుండా లఖ్‌పతి దీదీ కింద ష్యూరిటీ పత్రాలు అవసరం లేకుండానే అదనపు రుణాలు ఇచ్చేందుకూ కూడా జిల్లాలోని అన్ని బ్యాంక్‌లకు లక్ష్యాలు కేటాయించారు. దీని వల్ల మహిళల జీవనోపాధి మెరుగుపడనుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples