Header Banner

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

  Mon Oct 14, 2024 08:28        Politics

తెలంగాణ మంత్రి కొండా సురేఖను వివాదాలు వదలడం లేదు. మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ చిక్కుకున్నారు. సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు వివాదం కావడం, ఆ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ నటుడు నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ వివాదం మరువకముందే మంత్రి సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ మంత్రి సురేఖ పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదం అయింది. వివరాల్లోకి వెళితే .. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ధర్మారంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఆదివారం వివాదం నెలకొంది. దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో కొండా సురేఖ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. 

 

ఇంకా చదవండి: మహిళలకు సున్నా వడ్డీకే రూ.10 లక్షలు.. ప్రభుత్వం శుభవార్త! అది ఎలానో మీకు తెలుసా? ఆ వివరాలు చూడండి!

 

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ అనుచరులు ..రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గీసుకొండ పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నా చేశారు. చివరకు సమస్యను పరిష్కరిస్తామని సీఐ మహేందర్ హామీ ఇవ్వడంతో కొండా అనుచరులు ధర్నా విరమించారు. మరో పక్క తన వర్గీయులైన ముగ్గురిని గీసుకొండ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆమె నేరుగా గీసుకొండ పోలీసులు స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఎస్ఐ కుర్చీలో కూర్చుని పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. తన అనుచరులను ఎందుకు అరెస్టు చేశారంటూ నిలదీశారు. మంత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలియడంతో పెద్ద సంఖ్యలో ఆమె అనుచరులు అక్కడకు చేరుకున్నారు. విషయం వివాదాస్పదం కావడంతో వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝూ అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంలో సీపీపైనా మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu