ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

Header Banner

ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

  Tue Oct 15, 2024 07:00        Politics

మహిళలకు పండుగ శుభవార్త. దీపావళి పండుగకు ఒక్కో మహిళ అకౌంట్‌లోకి రూ. 3 వేలు వచ్చి జమ కానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. అయితే ఈ డబ్బులు ఎవరెవరికి లభిస్తాయి? అర్హతలు ఏంటివి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం దీపావళి బోనస్ ప్రకటించింది. లడ్‌కి బహిన్ యోజన స్కీమ్ కింద ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఒకేసారి రెండు ఇన్‌స్టాల్‌మెంట్ల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. నాలుగో విడత, ఐదో విడత డబ్బులు మహిళల అకౌంట్లలో జమ అవుతాయని చెప్పుకోవచ్చు. అంటే రూ. 3 వేలు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో పడిపోతాయి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ మొత్తం లభిస్తుంది. ప్రభుత్వం దీపావళి పండుగకు ఈ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో స్కీమ్ కింద అర్హత కలిగిన మహిళలు అందరికీ ఈ బెనిఫిట్ లభిస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలల ఇన్‌స్టాల్‌మెంట్లను కలిపి ఒకేసారి చెల్లిస్తారు. అక్టోబర్ నెలలో రూ. 1500 కాకుండా ఒకేసారి రూ. 3 వేలు లభించనున్నాయి. ఇప్పటికే చాలా మందికి ఈ డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మళ్ళి గట్టి షాక్! ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో!

 

దీని వల్ల పండుగను మరింత ఆనందంతో జరుపుకోవచ్చు. కాగా మహరాష్ట్రలో ఈ స్కీమ్ అమలులో ఉంది. 21 ఏళ్ల నుంచి 65 ఏళ్లలోపు వయసు కలిగిన మహిళలకు ఈ డబ్బులు లభిస్తున్నాయి. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు లోపు ఉండాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇన్‌కమ్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు ఉంటే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. కాగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మహిళలకు ప్రతి నెలా డబ్బులు అందిస్తామనే హామీని ఇచ్చాయి. అయితే వీటి అమలు ఎప్పటి నుంచి ఉంటుందో తెలీదు. ఏపీలో మహిళలకు ప్రతి నెలా రూ. 1500 ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఇక తెలంగాణలో అయితే నెలకు రూ. 2,500 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచి ఇస్తారో మాత్రం చెప్పలేదు. మహిళలకు ఇచ్చిన ఈ హామీని వెంటనే అమలు చేస్తే చాలా మందికి ఊరట కలుగుతుందని సర్వత్రా వినిపిస్తోంది. అందువల్ల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Election2024 #APPeoples