ఏపీ ప్రజలకు శుభవార్త.. సంచలన పథకం తీసుకురానున్న చంద్రబాబు! దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మందికి!

Header Banner

ఏపీ ప్రజలకు శుభవార్త.. సంచలన పథకం తీసుకురానున్న చంద్రబాబు! దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మందికి!

  Tue Oct 15, 2024 08:05        Politics

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో సంచలన పథకాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా సంక్షేమం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీ హయాంలో అమలు చేసిన పలు పథకాలను తిరిగి తీసుకురావడానిక ప్లాన్స్ చేస్తోంది. ఈ తరుణంలో మరో కీలక గుడ్ న్యూస్ చెప్పనుంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలను ఏపీ సర్కార్ రద్దు చేసింది. మరికొన్నింటి పేర్లను కూడా కూటమి సర్కార్ మార్చింది. దీంతో పాటుగా మరిన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ అమలు చేసిన అన్న క్యాంటీన్లను తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మందికి కేవలం రూ.5లకే భోజనం దొరుకుతుంది. ప్రస్తుతం రెండు విడతల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సర్కార్.. గతంలో అమలైన మరో కీలక పథకాన్ని మరలా ప్రజల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

 

ఇంకా చదవండి: ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

 

టీడీపీ సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పంపిణీ పథకం ప్రారంభించింది. త్వరలోనే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ ప్రభుత్వం 2016 జులై 12న ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ల కింద రూ.800 విలువైన దుప్పటి, దోమతెర, స్లీపింగ్‌ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్‌తో పాటు చిన్నపిల్లల సబ్బులను జిప్‌ బ్యాగ్‌లో ఉంచి బాలింతలకు ప్రభుత్వం అందజేసేది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఈ పథకాన్ని రాష్ట్రంలో తిరిగితీసుకు వచ్చేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్‌లో అమలవుతున్న ఈ తరహా పథకాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి కనీసం రూ.1,200 నుంచి రూ.1,300 వరకు ఖర్చుపెడుతున్నారు. రాష్ట్రంలో ‘ఆసరా’ కింద బాలింతలకు ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu