48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

Header Banner

48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

  Tue Oct 15, 2024 16:02        Politics

శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటనలో నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. వారికి వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. "సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నాం. ఇళ్లు, వాణిజ్య సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసుశాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యమవుతుంది. పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని వినియోగించి నేర నియంత్రకు సహకరించాలి. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు నిందితులను పట్టుకోగా.. వారిలో ఒకరిపై 37 కేసులు ఉన్నాయి. ఆ నిందితుడిపై అత్యాచార ఆరోపణలూ ఉన్నాయి. అందుకే త్వరితగతిన విచారణకు ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నాం. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు” అని హోం మంత్రి అన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. మహిళలు ఎన్ని షాపులు దక్కించుకున్నారో తెలుసా? అందరి సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో లక్కీ డ్రా!

 

ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

 

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

వైసీపీకి మరో షాక్! పార్టీ వీడనున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన!

 

ఆ మాజీ మంత్రిని చంపింది మేమే! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన!

 

రేపే మద్యం దుకాణాలకు డ్రా! ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా?

 

పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ! 11 మంది దుర్మరణం!

 

దేశంలో తయారయ్యే విదేశీ మద్యం రేట్లు పెరుగుదల! అదనపు ప్రివిలేజ్ ఫీజు వసూలు! గరిష్టంగా ఎంత అంటే?

 

చంపేస్తామంటూ 15 రోజుల క్రితమే వార్నింగ్! అన్నట్టుగానే మాజీ మంత్రి హత్య!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #srisathyasai #case #arrest #police #homeminister #todaynews #flashnews #latestupdate