అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా..! ఇక తగ్గేదే లేదు అని అంటున్న అధికారులు!

Header Banner

అమరావతి నిర్మాణాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా..! ఇక తగ్గేదే లేదు అని అంటున్న అధికారులు!

  Wed Oct 16, 2024 07:00        Politics

కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నిర్మించాల్సిన శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్.. అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ, అధికారుల భవనాలకు సంబంధించిన పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, ఆ ఐకానిక్‌ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. అయితే రాజధానిలో నిర్మాణాలపై తాజాగా కూటమి సర్కార్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించిన ఆకృతులనే ప్రస్తుతం కొనసాగించాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇంకా చదవండి: అమరావతి భవనాలకు ఆకర్షణీయ రూపకల్పనతో నిర్మాణానికి నూతన ఆరంభం! నార్మన్ ఫోస్టర్ మళ్లీ రంగంలోకి!

 

వాటి బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, అవసరమైతే అంతర్గతంగా మార్పులు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలా చేస్తే ప్రభుత్వానికి భారీగా డబ్బులు ఆదా అవుతాయని భావిస్తోంది. అమరావతిలో పలు భవనాలకు సంబంధించి గతంలోనే పునాదుల నిర్మాణం పూర్తి అయ్యిందని, ఇప్పుడు ఆకృతులను మార్చితే ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆకృతుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే సీఆర్‌డీఏ అధికారులు హైకోర్టు భవన ఆకృతులకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులతో పలు కీలక సూచనలు తీసుకున్నారు. మరోవైపు భవన నిర్మాణాలను వేగవంతం చేయడం కోసం డిజైన్లకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్‌ నియామకానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. గతంలో నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు వచ్చిన లండన్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు కూడా ప్రీబిడ్‌ మీటింగుకు హాజరయ్యారు. తాజాగా ఈ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో నిర్మించిన హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్టంగానే ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు సర్టిఫై చేయడంతో ఆ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. గతంలో రూపొందించిన ఆకృతుల్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టు ఆకృతిని బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఐదు టవర్లుగా.. డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించాలనుకున్నారు.. కానీ అవి మధ్యంతరంగా ఆగిపోయాయి.

 

ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!

 

48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!

 

ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప‌థ‌కం!

 

ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!

 

155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!

 

జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!

 

ఏపీలో లిక్కర్ టెండర్ల కిక్కు.. మహిళలు ఎన్ని షాపులు దక్కించుకున్నారో తెలుసా? అందరి సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో లక్కీ డ్రా!

 

ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?

 

మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!

 

ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!

 

చంద్రబాబా మజాకా.. మరోసారి ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 అభివృద్ధి!

 

మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #Jagan #GovernmentJobs #Saraly #Amaravati #Pinchalu